Asianet News TeluguAsianet News Telugu

మదనపల్లె జంట హత్యలు : నిందితులకు బెయిల్..

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరు అయింది. జనవరి 24న మూఢ భక్తి తో మదనపల్లి లోని తమ ఇంట్లో కన్నకూతుర్లను దారుణంగా హతమార్చిన కేసులో అరెస్ట్ అయిన పద్మజా, పురుషోత్తంలకు మదనపల్లె న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

madanapalle crime suspects were sanctioned bail - bsb
Author
Hyderabad, First Published Apr 27, 2021, 4:11 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరు అయింది. జనవరి 24న మూఢ భక్తి తో మదనపల్లి లోని తమ ఇంట్లో కన్నకూతుర్లను దారుణంగా హతమార్చిన కేసులో అరెస్ట్ అయిన పద్మజా, పురుషోత్తంలకు మదనపల్లె న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

 మానసిక సమస్యలతో బాధపడుతున్నా పద్మజా, పురుషోత్తంలకు తొలుత తిరుపతి రుయా ఆస్పత్రిలో.. ఆ తర్వాత విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు. అనంతరం వారిని ఇటీవలే మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో నిందితులకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. 

తండ్రి అక్కడే : శూలంతో పొడిచి, డంబెల్ తో కొట్టి కూతుళ్లను చంపిన తల్లి...

2021 జనవరిలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో సొంత తల్లిదండ్రులే ఇద్దరు కూతుళ్లను చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.పెద్ద కూతురు అలేఖ్యను పూజ గదిలో తండ్రి పురుషోత్తంనాయుడు చంపేశాడు. ఏ1గా తండ్రి పురుషోత్తం, ఏ2 తల్లి పద్మజగా పోలీసులు చేర్చారు.చిన్న కూతురును డంబెల్ తో తల్లి కొట్టి చంపింది. 

తన చెల్లెలిని  తీసుకొని రావడానికి తనను కూడ చంపాలని పెద్ద కూతురు కోరింది. దీంతో పూజ గదిలో పెద్ద కూతురును తండ్రి కొట్టి చంపాడు. కూతుళ్లను కొట్టి చంపిన తర్వాత తామిద్దరూ కూడ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తన తోటి ఉద్యోగికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకొన్నారు. 
ఆత్మహత్య చేసుకోవాలని భావించిన పురుషోత్తంనాయుడు దంపతులను అడ్డుకొన్నాడు.

పద్మజకు వదలని క్షుద్రపిచ్చి: కరోనా టెస్టుకు నో, నా శరీరం నుంచే......

వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని కూతుళ్లను చంపిన దంపతులను విచారించారు.  నిన్న సాయంత్రం  కూతుళ్ల అంత్యక్రియలు నిర్వహించారు. ఇవాళ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు పిల్లలను హత్య చేసేందుకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios