నెల్లూరు జిల్లా గూడూరులో విషాదం చోటు చేసుకొంది. ప్రియురాలి ఇంట్లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రియురాలు  మరణించింది. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. 

నెల్లూరు: నెల్లూరు జిల్లా గూడూరులో విషాదం చోటు చేసుకొంది. ప్రియురాలి ఇంట్లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రియురాలు మరణించింది. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది.నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసే దంపతుల కూతురు తేజస్విని, వెంకటేష్ ప్రేమించుకొన్నారు. 

also read:విషాదంగా మారిన ప్రేమజంట అదృశ్యం: తోటపల్లి రిజర్వాయర్‌లో డెడ్‌బాడీల గుర్తింపు

తేజస్విని తల్లిదండ్రులు విధులకు వెళ్లిపోయిన తర్వాత వెంకటేష్ ప్రియురాలు ఇంటికి వెళ్లాడు. అక్కడే వీరిద్దరూ ఉరేసుకొన్నారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తేజస్విని మరణించింది. వెంకటేష్ అపస్మార స్థితిలోకి వెళ్లాడు. 

వీరిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే విషయమై వివరాలు తెలియరాలేదు. విజయనగరం జిల్లాలో కూడ ఇదే తరహ చోటు చేసుకొంది. మూడు రోజుల క్రితం తోటపల్లి రిజర్వాయర్ లో దూకి ప్రేమ జ.ంట ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకొనే ముందు స్నేహితులు రాకేష్ సెల్పీ వీడియో తీసి పంపారు. ఈ వీడియో ఆధారంగా తోటపల్లి రిజర్వాయర్ లో గాలింపు చేపడితే బుధవారం నాడు మృతదేహాలు బయటపడ్డాయి.