రక్తం మరగాల్సిన చోట: ప్రియురాలిని పాడు చేస్తుంటే.. పారిపోయిన ప్రియుడు..

lover donot prevent rape attempt on Girl Friend in guntur
Highlights

రక్తం మరగాల్సిన చోట: ప్రియురాలిని పాడు చేస్తుంటే.. పారిపోయిన ప్రియుడు..

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా చూసినా.. చెడుగా మాట్లాడినా చెంప చెళ్లుమనిపిస్తాడు ప్రియుడు. కానీ తన కళ్లేదుట ప్రియురాలిని బలవంతం చేయబోతే అతని రక్తం మరగాల్సి చోట ఆమెను వారికి అప్పగించి పారిపోయాడు ఓ పిరికి ప్రేమికుడు. గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో దర్యాప్తు జరిపిన పోలీసులకు నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.

గుంటూరులో నర్స్‌గా పనిచేస్తోన్న యువతి శుక్రవారం తన విధులు ముగించుకుని రాత్రి పదిగంటల సమయంలో మంగళగిరి సమీపంలోని కోకోకోలా కంపెనీ సమీపానికి తన ప్రియుడితో కలిసి వెళ్లింది. ఈ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు.. వారి వెనకాలే వచ్చి ప్రియుడిని కొట్టి ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి రాత్రంతా ఆమెకు నరకం చూపించారు.

వారు కొట్టిన దెబ్బలకు మళ్లీ లేచి వాళ్లని వారించకుండా అక్కడి నుంచి పారిపోయాడు.. కనీసం జరిగిన ఘోరాన్ని స్థానికులకు కానీ.. పోలీసులకు కానీ చెప్పలేదు.. రాత్రంతా నరకం అనుభవించి స్పృహా తప్పి పడివున్న ఆమెను గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడితో పాటు ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
 

loader