Asianet News TeluguAsianet News Telugu

సీఎం సొంతజిల్లాలో లవ్ జిహాద్... కడప యువకుడి ట్రాప్ లో గుజరాతీ యువతి, రంగంలోకి బిజెపి

ఆంధ్ర ప్రదేశ్ లో మరో లవ్ జిహాద్ వ్యవహారం వెలుగుచూసింది. కడప జిల్లాకు చెందిన ఓ ముస్లిం యువకుడు గుజరాత్ కు చెందిన హిందూ యువతిని సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసినట్లు బిజెపి నేత సునీల్ దేవదర్ ఆరోపించారు. 

love jihad in ap... kadapa boy trapped gujarat girl
Author
Kadapa, First Published May 14, 2022, 1:45 PM IST

కడప: ఆంధ్ర ప్రదేశ్ కడప జిల్లా బద్వేల్ కు చెందిన ముస్లీం యువకుడు హిందూ యువతిని ప్రేమపేరుతో నమ్మించి లవ్ జిహాద్ కు పాల్పడ్డాడని రాష్ట్ర బిజెపి ఇంచార్జి సునీల్ దేవదర్ ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలో నివాసముండే మద్యతరగతి కుటుంబానికి చెందిన యువతితో కడప జిల్ల బద్వేల్ కు చెందిన సోహెల్ సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నాడు. వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే యువతి ఇటీవల కుటుంబసభ్యులను వదిలి ప్రియుడి వద్దకు వచ్చింది.  

ఇలా హిందూ అమ్మాయిని లవ్ జిహాదీలో భాగంగా ముస్లీం యువకుడు ట్రాప్ చేసిన విషయం బిజెపి నేత సునీల్ దేవదర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన వెంటనే ఏపీ పోలీసులతో పాటు బిజెపి నాయకులకు ఈ విషయాన్ని తెలియజేసారు. దీంతో కడప జిల్లా బిజెపి అధ్యక్షుడు యల్లారెడ్డి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని యువతికి కౌన్సిలింగ్ చేసాడు. లవ్ జిహాది గురించి వివరించడంతో యువతి తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి అంగీకరించింది. ఇలా బిజెపి నేతల చొరవతో యువతి తల్లిదండ్రుల చెంతకు చేరింది. 

లవ్ జిహాదీ ద్వారా యువతి జీవితం నాశనంకాకుండా కాపాడారంటూ యల్లారెడ్డిని సునీల్ దేవదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ''కడప జిల్లా బిజెపి అధ్యక్షులు యెల్లారెడ్డి కి  ప్రతి హిందువు అభినందించాలి. ఆయన ఎంతో ధైర్యంతో గుజరాత్ రాష్ట్రం సూరత్ కు చెందిన హిందూ యువతి జీవితాన్ని కాపాడారు. సోషల్ మీడియా ద్వారా ఓ ముస్లీం యువకుడు యువతిని ట్రాప్ చేసి తీసుకురాగా తిరిగి ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో యెల్లారెడ్డి ఎంతో కృషి అమోఘం'' అంటూ యెల్లారెడ్డిని శాలువాతో సన్మానిస్తున్న వీడియోను జతచేసి సునీల్ దేవదర్ ట్వీట్ చేసారు. 

ఇదిలావుంటే ఇటీవల లవ్ జిహాదీలో భాగంగా తనను ఓ యువకుడు మోసం చేశాడంటూ గుంటూరు అర్బన్ ఎస్పీకి ఓ యువతి ఫిర్యాదు చేసింది. మూడు సంవత్సరాల క్రితం ఎస్వి యూనివర్శిటీలో చదువుతున్న తనను గుంతకల్ కు చెందిన తాసీఫ్ పరిచయం పెంచుకున్నాడని బాధిత యువతి దివ్య తెలిపింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని పేర్కొన్నారు. ఇలా ప్రేమ పేరుతో నమ్మించి పెళ్ళి చేసుకున్న తాసిఫ్ మత మార్పిడి చేయించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఇలా తనను మోసగించిన తాసీఫ్ పై చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎస్పీకి దివ్య ఫిర్యాదు చేశారు. 

తాసీఫ్ తనను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్ళి చేసుకున్నాడని బాధితురాలు తెలిపారు. హిందువునయిన తనను ఇస్లాంలోకి బలవంతంగా మతం మార్చే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్దాలను ఇచ్చి చిత్ర హింసలకు గురి చేశాడని... ఇప్పుడు మూడుసార్లు తలాక్ అని చెప్పి వదిలేశాడని ఫిర్యాదులో పేర్కొంది. 

పెళ్లి తర్వాత తనను రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడని దివ్య వెల్లడించింది. లవ్ జిహాద్ పేరుతో తనను తీవ్ర ఇబ్బందులు పెట్టిన తాసీర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని దివ్య ఎస్పీని కోరింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని దివ్య డిమాండ్ చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios