తిరుపతి: పార్లమెంట్లో ప్రధాని మోదీ కాళ్లకు మొక్కే వారిని కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాటం చేసే టీడీపీ అభ్యర్ధిని తిరుపతి ఉపఎన్నికల్లో గెలిపించాలని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

 రాష్ట్రం నుంచి  28 మంది రోబోలను జగన్ రెడ్డి పార్లమెంట్ కు పంపారు,  ఆరోబోలు ప్రధాని   మోదీ కనపడితే నమస్కరించేలా జగన్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చారు. కేంద్రం ఏ చట్టం తెచ్చినా గుడ్డిగా అవి ఎస్ అంటాయి. పార్లమెంట్ లో ఈ రెండేళ్లలో వైసీపీ ఎంపీలు ఏం పీకారు? రాష్ట్రానికి  వారి వల్ల ఉపయోగం ఏంటి? తిరుపతి పార్లమెంట్ లో ఒక్క అభివృద్ది  కార్యక్రమం చేపట్టారా? అని ఆయన ప్రశ్నించారు.

 ఇక్కడ ఉన్న ఐఐటి, ఐఆర్ ఎస్ గురించి కేంద్రాన్ని అడిగారా? తిరుపతి ప్రజలు  రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో పోరాడే పనబాక లక్ష్మి  కావాలో మోదీ కాళ్లకు మొక్కే రోబో కావాలో ఆలోచించుకోవాలన్నారు.టీడీపీకి ఉన్నది  నలుగురు  ఎంపీలేఅయినా సింహాల్లా గర్జిస్తున్నారు, హోదా నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్, విభజనహామీల గురించి కేంద్రంపై ప్రతిరోజు పార్లమెంట్ లో పోరాడుతున్నారు. 

ఇతర రాష్ర ప్రాంతీయ పార్టీలు నాయకులు నాకు పోన్ చేసి వైసీపీ ఎంపీల వల్ల మీ రాష్ట్రానికి ఖర్మ పట్టిందంటున్నారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మ్యానిపెస్టోలో పెట్టింది. అక్కడకు వెళ్లి వైసీపీ నేతలు బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి ఒక న్యాయం, పుదుచ్చేరికి ఒక న్యాయమా?  దీనికి వైసీపీ ఎంపీలు సమాదానం చెప్పాలన్నారు.

. ఇది  వైసీపీ ప్రభుత్వం కాదు, జేసీబీ ప్రభుత్వం జే అంటే జేటాక్స్ , కరప్షన్, బీ అంటే బాదుడే బాదుడు అని ఆయన సెటైర్లు వేశారు. టీడీపీ హయాంలో చౌకగా లభించే నిత్యవసరాల ధరల్ని ఈ బాదుడు రెడ్డి వచ్చి రెండింతలు పెంచాడన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కంది పప్పు  కిలో 40 ఉంటే ..బాదురు రెడ్డి వచ్చి రూ. 67 రూపాయలకు పెంచాడు. పంచధార రూ. 20 నుంచి రూ. 34 కి చింతపండు రూ. 114, రూ. 251 కి పెంచారన్నారు.

 పెట్రోల్ ,డీజిల్ 100 కి చేరింది, గ్యాస్ సిలిండర్ 1000, నాడు ట్రాక్టర్ ఇసుక రూ. 1500 లకే వస్తే నేడు  రూ. 5000 వేలకు అమ్ముతున్నారు. రాష్ట్రంలో బంగారం అయినా సులభంగా దొరుకుతుంది గానీ తట్టెడు ఇసుక దొరకటం లేదని ఆయన చెప్పారు.

జగన్ రెడ్డికి దళితులంటే చిన్నచూపు అని ఆయన ఆరోపించారు. తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ చనిపోతే కనీసం జగన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించలేదు, కానీ జగన్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన  చల్లా రామక్రిష్టారెడ్డి చనిపోతే స్పెషల్ ప్లైట్ వేసుకుని మరీ వెళ్లారని ఆయన గుర్తు చేశారు..  బద్వేలులో దళిత ఎమ్మెల్యే సుబ్బయ్య చనిపోతే..మేమంతా బాదపడ్డాం, కానీ జగన్ మాత్రం అక్కడకెళ్లి  నవ్వుతున్నారన్నారు.


తిరుపతిలో రెండేళ్లలో ఒక్క అబివ్రద్ది కార్యక్రమం జరిగిందా? టీడీపీ హయాంలో ప్రారంబించిన ప్లైఓవర్ ఇప్పటి వరకు పూర్తి చేయలేపోయారు.  టీడీపీ హయాంలో చిత్తూరుకు, రాష్ట్రానికి అనేక కంపెనీలు తెచ్చినట్టుగా ఆయన చెప్పారు.. 

 150 సీట్లు, 70 శాతం పంచాయితీలు గెలిచామని వైసీపీ ప్రభుత్వం విర్రవీగుతోంది.  వారి గర్వాన్ని అనిణే అవకాశం ఈ ఉప ఎన్నిక ద్వారా  వెంకన్న మీకో అవకాశం  కల్పించారు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఓటర్లను కోరారు.

స్వంత  చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర మహిళలకు ఏం చేస్తాడో ఆలోచించాలి. ఒక చెల్లిని హైదరాబాద్లో, మరో చెల్లిని డిల్లీలో వదిలేశారు. సొంతబాబాయిని చంపి రెండేళ్లయితే ఇంతవరకు చర్యలు లేవన్నారు.