అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా జగన్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు 108 వాహనాన్ని, ఆవును సీఎం చంద్రబాబు పంపిచారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జగన్ తొలుత 108 డ్రామా, ఆ తర్వాత కోడికత్తి డ్రామా కొనసాగించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్తగా ఆవు డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఆడిన ఏ డ్రామా రక్తి కట్టలేదన్నారు. 

ఒకవేళ చెత్త నటనకు అవార్డులంటూ ఉంటే జగనే అన్నీ కైవసం చేసుకుని ఉండేవారని మంత్రి ఎద్దేవా చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జగన్ 108 గురించి, ఆవు గురించి మాట్లాడిన మాటల వీడియోను సైతం ట్విట్టర్లో పొందు పరిచారు. 

జగన్ పై తనకు ఉన్న మర్యాదతో చెత్తనటనకు గాను భాస్కర్ అవార్డు ఇవ్వాలని కోరుతున్నట్లు లోకేష్ తెలిపారు.