Asianet News TeluguAsianet News Telugu

చావు దెబ్బతిన్నా బుద్దిరాలేదు: వైఎస్ జగన్ పై లోకేష్ ఫైర్

ఒకప్పుడు తండ్రి శవాన్ని అడ్డంపెట్టుకొని సీఎం పీఠం ఎక్కాలి అనుకుని చావు దెబ్బతిన్నాడని అయినా జగన్‌కి బుద్ధి రాలేదని విమర్శించారు. కొండవీడులో రైతు కోటయ్య మృతికి సానుభూతి ప్రకటించకుండా వైసీపీ నీచ రాజకీయాలకు వాడుకుంటోందని ఎద్దేవా చేశారు. 

lokesh fires on ys jagan over farmer died issue
Author
Amaravathi, First Published Feb 19, 2019, 8:11 PM IST


అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. కొండవీడులో రైతు ఆత్మహత్యపై వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని లోకేశ్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒకప్పుడు తండ్రి శవాన్ని అడ్డంపెట్టుకొని సీఎం పీఠం ఎక్కాలి అనుకుని చావు దెబ్బతిన్నాడని అయినా జగన్‌కి బుద్ధి రాలేదని విమర్శించారు. కొండవీడులో రైతు కోటయ్య వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. రైతు మృతికి సానుభూతి ప్రకటించకుండా వైసీపీ నీచ రాజకీయాలకు వాడుకుంటోందని ఎద్దేవా చేశారు. 

 

శవాలపై పేలాలు ఏరుకునే 420 జగన్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతు పొలానికి, సీఎం హెలిప్యాడ్‌కి సంబంధమే లేదని లోకేశ్ స్పష్టం చేశారు. వైసీపీ శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువైందని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవ, కుల రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారని లోకేశ్ ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. 

 

మరోవైపు ఆత్మహత్య చేసుకున్న రైతును కాపాడేందుకు పోలీసులు ఎంతో శ్రమించారని స్పష్టం చేశారు. పోలీసులు కష్టాన్ని అభినందించాల్సిందిపోయి స్వార్థ రాజకీయం కోసం పోలీసులపై నిందలు వెయ్యడం అతని శవరాజకీయాలకు నిదర్శనమంటూ లోకేష్ ఆరోపించారు. రైతు కోటయ్యను పోలీసులు భుజాలపై ఎత్తుకుని పరుగున వెళ్తున్న వీడియోను అప్ లోడ్ చేసిన లోకేష్ ఈ వీడియో చూస్తే పోలీసులు పడ్డ శ్రమ తెలుస్తోందని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios