టాలీవుడ్ యంగ్ టైగర్, సినీ నటుడు ఎన్టీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి నుంచే అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు విషెస్ హోరెత్తిస్తున్నారు. కాగా.. తాజాగా తారక్ కి మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బర్త్ డే విషెస్ తెలియజేశారు.

లోకేష్.. ఎన్టీఆర్ కి వరసకు బావ అవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఎన్టీఆర్ గతంలో టీడీపీకి ఎన్నికల సమయంలో ప్రచారం కూడా చేశారు. కాగా.. లోకేష్ ట్విట్టర్ లో చేసిన ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

 

ఈ ఏడాది మరిన్ని విజయాలు, సంతోషాలు అందాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు. లోకేశ్‌తో పాటు టీడీపీ శ్రేణులు చెబుతున్న శుభాకాంక్షలతో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌కు శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ యువనాయకుడు రామ్మోహన్ నాయుడు తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది గొప్పగా సాగాలని ఆకాంక్షించారు. 

ఎన్టీఆర్‌కు నెట్టింట పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందించారు. ఎన్టీయార్ సిక్స్‌ప్యాక్ బాడీ ఫొటోను పోస్ట్ చేసి.. ‘ఆ బాడీ ఎంట్రా నాయనా’ అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఓ స్పెషల్ వీడియో ద్వారా `బిగ్‌బాస్-1` హౌస్‌మేట్స్ చెప్పిన విషెస్ కూడా ఆకట్టుకుంది.  ప్రముఖ సంగీత దర్శకడు ఎస్ఎస్ తమన్ ఈ వీడియోను తన ట్విటర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం తారక్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా నుంచి ఆయనకు సంబంధించి టీజర్ కానీ, ఫస్ట్ లుక్ కానీ విడుదలౌతుందని అందరూ భావించారు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా విడుదల కాలేదు.