తిరుమలకు చేరుకొన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా: రేపు శ్రీకాళహస్తికి
తిరుమలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సోమవారం నాడు చేరుకొన్నారు. రేపు ఉదయం ఆయన తిరుమల వెంకన్నను దర్శనం చేసుకొంటారు. ఆ తర్వాత ఆయన వేద పాఠశాలను సందర్శిస్తారు. అక్కడి నుండి నేరుగా శ్రీకాళహస్తికి చేరుకొంటారు.
తిరుమల: లోక్‌సభ స్పీక్ ఓం బిర్లా సోమవారం నాడు తిరుమలకు చేరుకొన్నారు. రేపు ఉదయం ఆయన తిరుమల వెంకటేశ్వరస్వామని దర్శంచుకోనున్నారు.లోక్‌సభ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఓంబిర్లా ఇవాళ తిరుమలకు వచ్చారు. తిరుమలకు వచ్చిన ఓంబిర్లాకు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.
రేపు తిరుమల వెంకన్నను దర్శనం చేసుకొన్న తర్వాత వేద పాఠశాలను కూడ ఆయన సందర్శిస్తారు. అక్కడి నుండి ఆయన శ్రీకాళహస్తికి కూడ వెళ్తారు. అక్కడి నుండి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఇవాళ సాయంత్రం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా తిరుమలకు చేరుకొన్నారు. స్పీకర్ కు ఎంపీలు విజయసాయిరెడ్డి, డాక్టర్ గురుమూర్తి, మిథున్ రెడ్డి, టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు.
లోక్‌సభ వాయిదా పడిన మరునాడే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీశైలంలో సతీసమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేసి వెళ్లారు.పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న ఎంపీలు, కేంద్ర మంత్రులు సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఎంపీలు, మంత్రులు తమ స్వంత పనులకు సమయం కేటాయిస్తున్నారు.