అనంతపురం జిల్లా గుంతకల్లులో అమానవీయ సంఘటన జరిగింది. కరోనాతో మరణించిన మహిళ మృతదేహన్ని ఖననం చేసేందుకు వీల్లేదంటూ స్మశాన వాటిక వద్ద కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారులు ఎంత చెప్పినా వినకుండా మృతదేహాన్ని అడ్డుకుని వెనక్కి పంపించారు. కావాలంటే ఊరికి దూరంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని, అంతేకానీ ఇక్కడ మాత్రం జరగనీచ్చేది లేదని తేల్చి చెప్పారు.

దీంతో అధికారులు చేసేది లేక మృతదేహాన్ని మరోచోటికి తరలించారు. కనీసం మృతదేహాన్ని చివరి చూపుకి కూడా నోచుకుని పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి పరిస్ధితి ఎవరికీ రాకూడదని బాధితురాలి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.