మందుబాబులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం షాకిచ్చింది. రేపటి నుంచి పగటి పూట కూడా పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది.

రాష్ట్రంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు గాను  రాష్ట్ర ప్రభుత్వం  మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది.సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో కరోనా కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో  కరోనాపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో  మధ్యాహ్నం 12 గంటల తర్వాత  రాష్ట్రంలో కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రెండు వారాల పాటు పగటిపూట కర్ఫ్యూను  అమలు చేస్తారు. 

Also Read:కరోనా ఎఫెక్ట్: మే 5 నుండి ఏపీలో పగటిపూట సైతం కర్ఫ్యూ

ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరుచుకొనేందుకు అనుమతిని ఇచ్చారు. అయితే 12 గంటల వరకు కూడ ఆంక్షలు ఉంటాయి. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రి మండలి సమావేశం ముగిసింది.

రేపటి నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజా రవాణాకు ప్రభుుత్వం అనుమతించింది. మధ్యాహ్నం 12 తర్వాత పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు చేయనుంది ఏపీ సర్కార్. మధ్యాహ్నం 12 తర్వాత ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేస్తామని తెలిపింది.