ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో పిడుగు పడి నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో పిడుగు పడి నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. బోగోలులో జామాయిల్ తోట నరికేందుకు దాదాపు 30 మంది కూలీలు వచ్చారు. జామాయిల్‌ కర్రలు తొలగిస్తుండగా కూలీలపై పిడుగు పడినట్లు సమాచారం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. ఇక, మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.