లీ ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆళ్ళ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామంలో శ్రీ సీతారాములవారి కళ్యాణం నిర్వహించారు. ఇదే గ్రామంలో పుట్టి పెరిగి ఫార్మా రంగంలో ఆయన పారిశ్రామికవేత్తగా ఎదిగి ఆలయ అభివృద్ధిలో, గ్రామాభివృద్దిలో తనవంతు సహకారం అందిస్తున్నారు

గుంటూరు జిల్లా (guntur district) దుగ్గిరాల మండలం వీర్లపాలెం (veerlapalem) గ్రామంలో ఆదివారం శ్రీరామనవమి (sri ramanavami) పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాములవారి కళ్యాణం (sri rama kalyanam) నిర్వహించారు. లీ ఫార్మా లిమిటెడ్ (lee pharma limited) మేనేజింగ్ డైరెక్టర్ ఆళ్ళ వెంకటరెడ్డి (alla venkat reddy) , ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఇదే గ్రామంలో పుట్టి పెరిగి ఫార్మా రంగంలో పారిశ్రామికవేత్తగా ఎదిగి ఆలయ అభివృద్ధిలో, గ్రామాభివృద్ది లో తనవంతు సహకారం అందిస్తున్నారు ఆళ్ళ వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షేత్రపురాణం వివరించారు.

స్వాతంత్ర్యం రాక పూర్వమే గ్రామంలో దేవాలయం నిర్మించబడిందని తెలిపారు. ఇక్కడి మూలవిరాట్టు దీపపు స్థంభం మీద వెలసిఉండటం విశిష్టత అని వెంకటరెడ్డి చెప్పారు. మిగతా దేవాలయాలకు భిన్నంగా ఈ క్షేత్రంలో ధ్వజస్థంభం కేవలం ఐదు అడుగుల ఎత్తులోనే ఉంటుందని వెల్లడించారు. పూజారులుగా బ్రాహ్మణులు కాకుండా ఆలయ కమిటి సభ్యులే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారని వెంకటరెడ్డి పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా గ్రామంలో అందరూ దేవాలయానికి వస్తారని ఆయన పేర్కొన్నారు. కళ్యాణం రోజు స్వామి వారికి బెల్లంతో తులాభారం జరుగుతుందని... ఆ బెల్లంతో పరమాన్నం వండుకుని స్వీకరిస్తే సంతానం లేని దంపతులుకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారని ఆయన చెప్పారు. 

తాను లీ ఫార్మా తరుపున తన వంతు బాధ్యతగా తన తండ్రి పేరు మీద పొంగళ్ళు చేసుకొనే భక్తులు సౌకర్యార్థం వంటశాలను నిర్మించినట్లు గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తు వస్తున్నామని వెంకటరెడ్డి తెలిపారు. అన్న సమారాధనకు సమీప గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరిస్తారని ఆయన చెప్పారు. ఒకప్పుడు ఒక్కడిగా మెదలుపెట్టిన అన్నసమారాధన కార్యక్రమానికి నేడు మరో నలుగురు తోడవటం వలన వచ్చే పదిహేను సంవత్సరాలకు సరిపడా నిధులు సమకూరాయని వెంకటరెడ్డి తెలిపారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటుగా గ్రామస్తులు, ప్రయాణికుల కోసం లీ ఫార్మా ప్రయివేట్ లిమిటెడ్ తరుపున రూ.15 లక్షల వ్యయంతో బస్ షెల్టర్, ఉద్యానవనం నిర్మిస్తున్నామని వెంకటరెడ్డి చెప్పారు. మరో పదిహేను రోజుల్లో దీనికి ప్రారంభోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. సీతారాముల కళ్యాణంలో ఆళ్ళ వెంకటరెడ్డి , ఆయన సతీమణి రత్నకుమారి, కుమారుడు రఘుమిత్రా రెడ్డి , కోడలు ఆళ్ళ శైలజా, కూతురు ఆళ్ళ లీలా రాణి, అల్లుడు ప్రవీణ్ రెడ్డి, మనువడు ఆళ్ళ సాయిరాం, ఆళ్ళ కార్తికేయ, టి దుర్వాన్, మనువరాళ్ళు టి దీక్షా, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు..