వేధింపులు భరించలేక కానిస్టేబుల్ భార్య ఆత్మహత్యాయత్నం

Laxmiprasanna commits suicide attmept in Vijayawada
Highlights

భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విజయవాడలో కానిస్టేబుల్ గా పనిచేసే మురళి తన భార్య లక్ష్మీప్రసన్నను వేధింపులకు గురిచేసేవాడని లక్ష్మీప్రసన్న కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ వేధింపులకు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

విజయవాడ:భర్త వేధింపులు భరించలేక లక్ష్మీ ప్రసన్న అనే వివాహిత కిరోసిన్ పోసుకొని బుధవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చావు బతుకుల మధ్య ఆమె కొట్టు మిట్టాడుతోంది. లక్ష్మీ ప్రసన్న భర్త కానిస్టేబుల్ గా  పనిచేస్తున్నాడు.

విజయవాడకు చెందిన కానిస్టేబుల్  మురళి తన భార్య లక్ష్మీప్రసన్నను వేధింపులకు గురిచేసేవాడని  ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక లక్ష్మీప్రసన్న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు చెబుతున్నారు.

విజయవాడ ఒకటో నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే మురళిపై లక్ష్మీప్రసన్న కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. 90 శాతం ఆమె శరీరం కాలినట్టు వైద్యులు ప్రకటించారు. లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం మృత్యువుతో పోరాటం చేస్తోంది.  

గతంలో లక్ష్మీ ప్రసన్న పశ్చిమగోదావరి జిల్లాలో హోంగార్డుగా పనిచేసి మానేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  వీరిద్దరి మధ్య గొడవలకు కారణమేమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

loader