అమరావతి:రాష్ట్ర శాసనసభ తీసుకొన్న నిర్ణయంపై జోక్యం చేసుకొనే అధికారం న్యాయస్థానాలకు లేదని శ్రీకాకుళం జిల్లాకు  చెందిన ఉరిటి లక్ష్మి శైలజ  హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ ను దాఖలు చేశారు.

మంగళవారం నాడు ఆమె హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.  రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకొందని ఆమె గుర్తు చేశారు. దీన్ని గవర్నర్ కూడ ఆమోదించినట్టుగా పేర్కొన్నారు. చట్టసభల నిర్ణయాల్లో జోక్యం చేసుకొనే అధికారంలో న్యాయస్థానాలకు లేదని పిటిషన్ లో ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాల్లో జోక్యం చేసుకొనే అధికారంలో కోర్టులకు లేదని కోర్టులు తీర్పులు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ ఆ పిటిషన్ లో ప్రస్తావించారు.  ప్రభుత్వం చేసిన చట్టాల్లో కోర్టులకు జోక్యం చేసుకొనే అధికారం  లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, 13 ప్రకారం ఉందని పిటిషనర్ తెలిపారు. 

అంతేకాదు ఆర్టికల్ 14 ప్రకారంగా ప్రజల హక్కులకు భంగం కలిగితే జోక్యం చేసుకొనే అవకాశముందని పిటిషనర్ చెప్పారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ద్వారా చాలా మందికి ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు. అమరావతిలో రాజధాని ఉండడం వల్ల ఒక్క ప్రాంతానికే ప్రయోజనం కలుగుతోందన్నారు.