ఆంధ్రప్రదేశ్ లోని నర్సీపట్నం లో గ్రామదేవత ఉత్సవాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్థరాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఆపేయాలని పోలీసులు చెప్పడంతో వివాదం చెలరేగింది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకున్నారు. 

నర్సీపట్నం : నర్సీపట్నం గ్రామదేవత మరిడి మహాలక్ష్మి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రి 11 గంటల తర్వాత జరపడానికి వీల్లేదంటూ పోలీసులు పట్టుబట్టడం వివాదాస్పదంగా మారింది. చాలాచోట్ల కార్యక్రమాలను ఏసిపి మణికంఠ స్వయంగా ఆపించావేశారు. దీంతో అక్కడ గుమిగూడిన జనం పోలీసులతో తోపులాటకు దిగారు. వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు అయినప్పటికీ యువకులు సెల్ ఫోన్ లైట్ల వెలుగులో నృత్యాలు చేశారు. బాణాసంచా కాల్చారు. దీంతో పట్టణంలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. 

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్ అర్ధరాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల వేదిక వద్దకు చేరుకున్నారు. పోలీసులు నిలిపివేసిన కార్యక్రమాలను అయ్యన్నపాత్రుడు మళ్లీ ప్రారంభింపజేశారు. రాత్రి 12:30 గంటల వరకు కార్యక్రమాలను కొనసాగించాలని నిర్వాహకులకు సూచించి తాను కూడా కుటుంబ సభ్యులతో సహా అక్కడే ఉండిపోయారు. అక్కడే వేదికపై నుంచి స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో ఎప్పుడు నర్సీపట్నంలో పండుగ రోజున ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని.. అందరినీ.. గుర్తుపెట్టుకుని గుణపాఠం చెబుతామన్నారు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 11న poker, కోడిపందేలు నిర్వహిస్తున్నారని సమాచారంతో.. వాటిని అడ్డుకోవడానికి వెళ్ళిన ఎస్సైని గ్రామస్తులు పరిగెత్తించి, చొక్కా లాగి కొట్టిన ఘటన eluru జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఎర్రవల్లిలో పేకాట, కోడి పందేలు ఆడుతున్న విషయం తెలిసి.. ధర్మాజీ గూడెం స్టేషన్ కానిస్టేబుళ్ళు ఇద్దరూ అక్కడికి వెళ్లారు. స్థానికులు దుర్భాషలాడడంతో వారు స్టేషన్కు సమాచారం అందించారు.

ఏఎస్ఐ రాంబాబు మరో కానిస్టేబుల్ తో కలిసి ఎడవల్లి చేరుకుని వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వారు పోలీసులపై తిరగబడ్డారు. రాంబాబు ఎస్సై దుర్గా మహేశ్వరరావుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకు ఎస్సైకి, స్థానికులకు వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు యూనిఫాంలో ఉన్న ఎస్సైపై దాడి చేశారు. రహదారిపై పరిగెత్తిస్తూ, చొక్కా లాగేసి మరీ కొట్టారు. ఎస్సై కి గాయాలై, పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని సమాచారం. దీంతో సిఐ మల్లేశ్వరరావు అక్కడికి వెళ్లి ఎస్ఐని చికిత్స నిమిత్తం చింతలపూడి ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సీఐ మల్లేష్ దుర్గారావు మాట్లాడుతూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు వ్యక్తిగత కక్షతో ఎస్సై దుర్గా మహేశ్వర రావుపై దాడి చేశారు. వారిలో కొందరిని గుర్తించామని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.