Asianet News TeluguAsianet News Telugu

పొలిటికల్ ఎంట్రీపై మాజీ జెడీ తాజా వ్యాఖ్యలు ఇవీ

తనకు ఓ పార్టీతోనూ సంబంధం లేదని, తాను ఓ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. 

Lakshminarayana's latest comment on political entry

కర్నూలు: తనకు ఓ పార్టీతోనూ సంబంధం లేదని, తాను ఓ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. మహానంది సమీపంలోని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ కళాశాలలో గురువారం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

ప్రస్తుతం తాను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు, కొన్ని పత్రికలు తాను ఓ పార్టీలో చేరుతున్నానని ప్రచారం చేస్తున్నాయని, ఇందులో వాస్తవం లేదని అన్నారు. 

మహానంది మండలం ఎం. తిమ్మాపురం లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికి ఏడు జిల్లాల్లో తన పర్యటన పూర్తయిందని తెలిపారు. ప్రజా సమస్యలు తీర్చే పార్టీకే తన మద్దతు ఉంటుందని, ఏ రాజకీయ పార్టీలో చేరాలనే విషయంపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.

ఇదిలావుంటే, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్ర సందర్శనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వస్తున్నారనే సమాచారంతో శాస్త్రవేత్తలు, రైతు సంఘం నాయకులు ఎదురు చూశారు. చివరి నిమిషంలో పరిశోధన కేంద్రం సందర్శన రద్దు చేసుకున్నారు. దీంతో రైతు సంఘం నాయకులు, శాస్త్రవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలతో, రైతులతో ముఖాముఖి చర్చా ఉంటుందని భావించారు. దీంతో రైతు సంఘం నాయకులు రైతుల సమస్యలపై వినతిపత్రం అందించి ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లే విధంగా కృషి చేయాలని కోరడానికి వచ్చారు. మాజీ జేడీ కోసం ఉదయం 11 నుంచి 12.30 గంటల వర కు వేచి చూశారు. కానీ చివరకు లక్ష్మీనారాయణ రాకపోవడంతో రైతు సంఘం నాయకులు వైఎన్‌రెడ్డితో పాటు సుధాకర్‌, శివారెడ్డి, మోహన్‌రెడ్డి అసంతృప్తితో వెళ్లిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios