బిజెపి నేతతో సిబిఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ భేటీ

First Published 23, Jun 2018, 4:17 PM IST
Lakshminarayana meets Akula Satyanarayana
Highlights

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ శనివారం బిజెపి నేత ఆకుల సత్యనారాయణను కలుసుకున్నారు

విజయవాడ: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ శనివారం బిజెపి నేత ఆకుల సత్యనారాయణను కలుసుకున్నారు. గత కొంత కాలంగా ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరిందని అంటున్నారు.

అయితే, తమ భేటీకి ఏ విధమైన ప్రాధాన్యం లేదని, ఆకుల సత్యనారాయణ తనకు మంచి మిత్రుడని లక్ష్మినారాయణ అన్నారు. ఆయన గత కొంతకాలంగా రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. తనకు వ్యవసాయ మంత్రిగా పనిచేయాలనే కోరిక ఉందని ఒక సందర్భంలో చెప్పారు కూడా.

చంద్రబాబుపై కన్నా విమర్శనాస్థ్రాలు

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి రాష్ట్రాధ్యక్షుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పథకాలను చంద్రబాబు తన ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. తాము వైసిపి కుమ్మక్కయినట్లు టీడీపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

తిరుపతి సభలో ప్రధాని మోడీ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మాత్రమే చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారని తెలిపారు. చంద్రబాబుకు నిజం చెప్పే అలవాటు లేదని మండిపడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రెండేళ్ల జాప్యం జరిగిందని అన్నారు. దుగ్గరాజుపట్నం పోర్టుకు ఇస్రో అభ్యంతరం చెప్పిందని, మెకాన్ సంస్థకు సరైన వివరాలు ఇవ్వకపోవడం వల్లనే స్టీల్ ప్లాంట్ ఆలస్యం జరిగిందని అన్నారు. 

loader