తన తండ్రి ఎన్టీఆర్ ను తలచుకుంటూ నారా భువనేశ్వరి చేసిన ఎమోషనల్స్ కామెంట్స్ పై లక్ష్మీపార్వతి తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
అమరావతి : జైల్లో వున్న భర్త చంద్రబాబు నాయుడు కోసం నారా భువనేశ్వరి కొవ్వొత్తుల ర్యాలీలు, నిరాహార దీక్షలతో ఆందోళన చేస్తున్నారు. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్షకు దిగిన భువనేశ్వరి అక్టోబర్ 5 నుండి 'మేలుకో తెలుగోడా' పేరిట బస్సు యాత్రకు సిద్దమయ్యారు. ఇలా భర్త కోసం పోరాటానికి సిద్దమైన భువనేశ్వరికి వైసిపి నాయకురాలు లక్ష్మీ పార్వతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
''ఈ రోజు నా తండ్రి(ఎన్టీఆర్) జ్ఞాపకాలతో హృదయం నిండిపోయింది. తెలుగు జాతి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహానటుడు, నాయకుడు ఎన్టీఆర్. నిజం ఎంత కఠినంగా ఉన్నా ఎల్లప్పుడూ దానికి కట్టుబడి ఉండాలని ఆయన మనకు బోధించాడు. న్యాయానికే మద్దతుగా వుంటూ తెలుగు ప్రజలకు సేవ చేయాలనే అంకితభావంతో పనిచేసే ఆయన మనందరికీ ఆదర్శం'' అంటూ తండ్రి ఎన్టీఆర్ ను గుర్తుచేసుకుంటూ భువనేశ్వరి ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చూసాకే మీడియాతో మాట్లాడేందుకు వచ్చినట్లు లక్ష్మీపార్వతి తెలిపారు.
ఇన్నాళ్ల తర్వాత మీకు మీ తండ్రి గుర్తొచ్చారా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తండ్రికి అన్యాయం జరిగితే ఇన్నేళ్లలో ఒక్కసారయినా ఖండించింది లేదన్నారు. భువనేశ్వరే లక్షల కోట్లు సంపాదించి తేవాలంటూ చంద్రబాబు, లోకేష్ లతో అవినీతి చేపిస్తోందని ఆరోపించారు. నిజంగానే తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటే నీ భర్ చంద్రబాబు అక్రమ సంపాదన గురించి బయటపెట్టాలని భువనేశ్వరికి సూచించారు లక్ష్మీపార్వతి.
Read More మహిళలను కించపర్చడమేనా మీ సంస్కృతి: బండారు వ్యాఖ్యలకు రోజా కౌంటర్
నిజాయితీ పరుడుకి సేవచేసిన తాను అదృష్టవంతురాలినని లక్ష్మీపార్వతి అన్నారు. కానీ భువనేశ్వరి అవినీతి పరులను కాపాడటానికి బస్సు యాత్ర చేస్తానంటోంది అంటూ ఎద్దేవా చేసారు. ఇప్పుడు నీ భర్తపై చూపిస్తున్న జాలి, సానుభూతి నాన్నపై చూపించి ఉంటే సంతోషించేవారన్నారు. నీ తండ్రి పార్టీ లాక్కుని ప్రాణం తీస్తే ఏం చేసావని ప్రశ్నించారు. నీకు నిజంగానే మానవతా విలువలు ఉంటే... నువ్వు ఎన్టీఆర్ కే పుట్టి ఉంటే నిజాలు చెప్పాలంటూ భువనేశ్వరిపై లక్ష్మీపార్వతి సీరియస్ కామెంట్స్ చేసారు.
తన భర్త చంద్రబాబు తప్పు చేయలేదని ఎందుకు చెప్పడం లేదు? అంటూ భువనేశ్వరిని ప్రశ్నించారు లక్ష్మీపార్వతి. అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన భర్త కోసం ప్రజల్లోకి వెళతావా... వెళ్లి వారికి ఏం చెబుతావు? అని నిలదీసారు. సింగపూర్,మారిషస్, దుబాయ్ లలో నీ కుటుంబం లక్షల కోట్లు దాచలేదా? అని అడిగారు. ఇన్నాళ్ళకి పెద్ద దొంగ దొరికాడు... అతడిని జైల్లో పెట్టి శిక్షించడం తప్పా? అని అడిగారు. గొప్ప తల్లివి నువ్వు... పనికి మాలిని కొడుకుకి జన్మనిచ్చావ్ అంటూ మండిపడ్డారు. మళ్లీ నా అవినీతి భర్తకు అధికారం ఇవ్వండి... లక్ష కోట్ల దోపిడీ చేస్తారని చెప్తావా? అంటూ లక్ష్మీపార్వతి ఎద్దేవా చేసారు.
