Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన లక్ష్మీపార్వతి.. ఏమన్నారంటే..

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై సీఎం జగన్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు. 

lakshmi parvathi response on ntr health university Name change
Author
First Published Sep 26, 2022, 12:05 PM IST

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై సీఎం జగన్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు. అది ఎన్టీఆర్‌పై ద్వేషంతో చేసిన పని కాదన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు కావాలా?.. వర్సిటీకి ఉండాలా? అంటే తాను జిల్లాకే ఉండాలని కోరుకుంటానని చెప్పారు. జిల్లా పెద్దదని.. యూనివర్సిటీ చాలా చిన్నదని అన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంలోనే వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమ ఏమిటో తెలుస్తోందన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వొద్దని వాజ్‌పేయికి చంద్రబాబు నాయుడే చెప్పారని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని విమర్శించారు.

‘‘ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు ఎందుకు పెట్టారో ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. దీని గురించి నేను మాట్లాడలేదని చాలా మంది తిట్లు తిడుతున్నారు. దీనిపై నిజమైన అభిమానులు బాధపడితే.. దానిని నిజమైన బాధ అనుకోవాలి. కానీ ఎన్టీఆర్ హంతకులు బాధను నటిస్తున్నారు. వాళ్ల 14 ఏళ్ల పాలనలో ఏ శాశ్వత పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా?. వెన్నుపోటు పొడిచావు కాబట్టి.. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా 1998లో వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. 

వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలా?.. జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఉండాలా?.. అని ప్రభుత్వం రెండు ఆప్షన్స్ ఇస్తే.. నేను జిల్లాకే ఉండాలని చెబుతాను. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టినప్పుడు వాళ్లు ఎందుకు స్పందించలేదు?.

డాక్టర్‌గా, రూపాయి వైద్యుడిగా పేరు సంపాదించుకున్న వ్యక్తి తన తండ్రి అని జగన్ చెప్పారు. ఆయన పేరుతో ఉచిత హాస్పిటల్ నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. పేదవాళ్లకు కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యం చేయించిన గొప్ప వ్యక్తి  అని తెలిపారు. ఇన్ని మెడికల్ కాలేజ్‌లు వస్తున్నాయి.. కావున యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం సముచితం అని అన్నారు. అది చాలా కన్విన్సింగ్‌గా ఉంది. అది ద్వేషంతోనే, పగతోనే చేసింది కాదు. త్వరలోనే నేను ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తాను. ఏదైనా గొప్ప ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు తీసుకురావాడానికి సీఎంకు లేఖ ఇస్తాను’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. ఇక్కడ ఎన్టీఆర్‌ను అగౌరవ పరిచిందేమి లేదని అన్నారు. ఈ నిర్ణయంపై తటస్థంగా ఉండే వారంతా ఆలోచన చేయాలని కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios