మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ సినిమాపై స్పందించారు ఆయన సతీమణి లక్ష్మీపార్వతి. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు.

ఎన్టీఆర్ సుఖాలను మాత్రమే కాదు, కష్టాలను, అన్యాయాలను కూడా తెరపై చూపించడాన్నే బయోపిక్‌ అంటారన్నారు. ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్రను తీసే ధైర్యం బాలకృష్ణకు లేదని, అయితే వ్యక్తిగతంగా బాలయ్య చాలా మంచి వ్యక్తని లక్ష్మీపార్వతి తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు బాలకృష్ణ భయపడుతున్నారని,  రెండు భాగాలుగా సినిమా తీసినా,  అది ఎన్టీఆర్ సగం జీవిత చరిత్రే అవుతుందని ఎద్దేవా చేశారు.  కథానాయకుడు సినిమా చూసేందుకు నన్నెవరూ ఆహ్వానించలేదని ఎన్టీఆర్, వైఎస్సార్‌లాంటి ఆదర్శవంతమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్‌లో రావాలని ఆమె ఆకాక్షించారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్‌లో..‘‘ఎందుకు ఎందుకు అన్న పాటలో నా పై విమర్శలు ఎక్కువగా ఉన్నట్లు అనిపించిందని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా నా మనుసులోని ఆవేదనను ఆర్జీవీ తీరుస్తారని నమ్ముతున్నా అన్నారు.