కాకినాడ:తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం  కోరుమిల్లి వద్ద బుధవారం నాడు మధ్యాహ్నం పడవ మునిగింది. ఇసుక తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదం నుండి కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.

ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది.ఇసుక కొరతపై విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఈ నెల 14వ తేదీ నుండి ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం  నిర్ణయించింది.

ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే  బుధవారం నాడు పడవలో ఇసుకను తరలిస్తున్న సమయంలో పడవ మునిగింది.ఈ ప్రమాదంలో ఇసుక కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. 

Also read:operation royal vasista: బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం టీమ్

ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం-కచ్చులూరు మధ్య రాయల్ వశిష్ట బోటు మునిగింది.ప్రమాదం జరిగిన రోజున రాయల్ వశిష్ట బోటులో 77 మంది ప్రయాణం చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు.. 26 మంది ఈ ప్రమాదం నుండి సురక్షితంగా ప్రమాదం నుండి బయటకు వచ్చారు. 

Also read:బోటు వెలికితీత: నదీగర్భంలోకి దూసుకెళ్లిన గజఈతగాళ్లు.. పాప మృతదేహం లభ్యం

ప్లాన్ బీ లో భాగంగా బోటుకు చెందిన ప్యా‌న్ కు ఇనుప రోప్ ను తగిలించారు. ఈ రోప్ ద్వారా బోటును వెలికితీశారు.ధర్మాడి సత్యం బృందంతో పాటు డీప్ వాటర్ డైవర్లు బోటు వెలికితీతలో కీలక పాత్ర పోషించారు. విశాఖకు చెందిన  ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ చెందిన డ్రైవర్లు నాగరాజు, స్వామి అనే ఇద్దరు గోదావరి నదిలో మునిగిన బోటుకు  లంగర్ వేశారు.

అండర్ వాటర్ డైవర్లు  మూడు చోట్ల  లంగర్లు వేశారు. బోటు ముందు భాగంతో పాటు వెనుక భాగానికి లంగర్లు వేశారు. ప్లాన్ ఏ  ప్రకారంగా ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసేందుకు ప్రయత్నించింది.కానీ ఈ ప్లాన్ సక్సెస్ కాలేదు.

అయితే ఎట్టకేలకు గత నెల 26వ తేదీన రాయల్ వశిష్ట పున్నమి బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసింది.బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం బృందాన్ని కలెక్టర్ అభినందించారు.