Asianet News TeluguAsianet News Telugu

పోరాటానికి సొంత డబ్బు ఖర్చు చేశా, ప్రజాధనం కాదు: బాబుపై కేవీపీ విసుర్లు

ముఖ్యమంత్రి చేసిన దీక్ష ప్రజాధనంతో జరిగిందని, కానీ మూడేళ్ల కిందట కోటి సంతకాల ఉద్యమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిదని గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనకు ఏపీ నలుమూలలు నుంచి జనం తరలివస్తే వారికి మూడు రోజుల పాటు భోజనం, వసతి, ప్రయాణానికి టికెట్లను తన సొంత ఖర్చుతో చేసినట్లు కేవీపీ వెలల్డించారు. 

kvp ramachandra rao comments over chandrababu using public money for Deeksha
Author
Delhi, First Published Feb 13, 2019, 1:27 PM IST

ముఖ్యమంత్రి చేసిన దీక్ష ప్రజాధనంతో జరిగిందని, కానీ మూడేళ్ల కిందట కోటి సంతకాల ఉద్యమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిదని గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనకు ఏపీ నలుమూలలు నుంచి జనం తరలివస్తే వారికి మూడు రోజుల పాటు భోజనం, వసతి, ప్రయాణానికి టికెట్లను తన సొంత ఖర్చుతో చేసినట్లు కేవీపీ వెలల్డించారు.

చంద్రబాబు ఓవరాక్షన్ చేస్తున్నారని, నిరంకుశ ప్రధానిమోడీ పాలనకు బుద్ధి చెబుతామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తాను రూపొందించిన ప్రైవేట్ బిల్లుకు 14 పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిందన్నారు.

ఆ పార్టీలలో చంద్రబాబు కొత్తగా వచ్చి కలిశారని రామచంద్రరావు ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేకహోదా కేటాయిస్తూ సంతకం చేస్తారనే ఉద్దేశ్యంతోనే రాజ్యసభలో తన పోరాటానికి తాత్కాలిక విరామం ఇచ్చినట్లు కేవీపీ స్పష్టం చేశారు. తమ లాంటి వారిని అల్పులుగా, పార్టీ వ్యతిరేకులుగా చిత్రీకరించవద్దని ఆయన చంద్రబాబుకు సూచించారు. తనకు పార్టీకి మధ్య అగాధం సృష్టించే ఆలోచనలు చేయవద్దన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios