కువైట్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మదీక్షకు సంఘీభావంగా కువైట్‌లో పలువురు నాయకులు నిరసనలు చేపట్టారు. శుక్రవారం స్థానిక ఫర్వానియా దువైహి పాలెస్‌ హోటల్‌లో తెలుగుదేశం పార్టీ కువైట్‌ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. 

ఈ సందర్భంగా తెదేపా కువైట్‌ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్‌రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన ధర్మదీక్షకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

కార్యక్రమంలో టిడిపి కువైట్‌ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి మోహన్‌బాబు, సలహాదారులు వేగి వెంకటేష్. మేము సైతం చంద్రమౌళి, నాగముని, తెలుగు దేశం కువైట్ అధికార ప్రతినిధులు సుబ్బారెడ్డి, షేక్‌ బాషా, మైనారిటీ వింగ్‌ నాయకులు రహంతుల్లా, మైనార్టీ విభాగం కార్యదర్శి అబ్దుల్‌ కరీం, పీఆర్‌ఓలు మద్దిన ఈశ్వర్‌నాయుడు, ముస్తాక్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

వీరితో పాటు అమ్మ హెల్పింగ్ హాండ్స్ ప్రభాకర్ యాదవ్, టిమ్‌ శ్రీను, జైచంద్ర నాయుడు, సాయం శ్రీధర్‌, సాయిక్రిష్ణ, శ్రీనివాసులు నాయుడు, బోయపాటి శ్రీను, గూడె నాగార్జున చౌదరి, ఛాన్ బాషా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.