Asianet News TeluguAsianet News Telugu

వాళ్లు ఆంబోతులు, అద్దెమైకులు, అబద్దాలకోర్లు

బీజేపీపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు నిప్పులు చెరిగారు. అగ్రిగోల్డ్ విషయంలో బీజేపీ ఆంబోతు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీలో నేతలు సైజులు వారీగా ఆబోతుల్లా ఉన్నారంటూ పరోక్షంగా రాంమాధవ్ ను ఉద్దేశిస్తూ ఘాటుగా విమర్శించారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణలు బీజేపీ అద్దెమైకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

kutumbarao slams on bjp leaders
Author
Vijayawada, First Published Oct 22, 2018, 4:02 PM IST

అమరావతి: బీజేపీపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు నిప్పులు చెరిగారు. అగ్రిగోల్డ్ విషయంలో బీజేపీ ఆంబోతు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీలో నేతలు సైజులు వారీగా ఆబోతుల్లా ఉన్నారంటూ పరోక్షంగా రాంమాధవ్ ను ఉద్దేశిస్తూ ఘాటుగా విమర్శించారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణలు బీజేపీ అద్దెమైకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర విభజన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు అగ్రిగోల్డ్ సమస్యను బీజేపీ తెరపైకి తెచ్చిందంటూ కుటుంబరావు మండిపడ్డారు. 2014 డిసెంబర్ లో భారతదేశంలోనే తొలిసారిగా అగ్రిగోల్డ్ సంస్థపై కేసు నమోదు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. తొమ్మిది నెలల్లో ఆస్తుల ఎటాచ్ మెంట్ చేసింది కేవలం తమ ప్రభుత్వమేనన్నారు. ఆస్తుల వేలాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది అగ్రిగోల్డ్ బాధితులు హైకోర్టును ఆశ్రయించారని వారంతా కేసును సీబీఐకు అప్పగించాలని కోరారని చెప్పారు. 

అయితే సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం సీఐడీకి కోర్టు మెుట్టికాయలు వేసిందంటూ అసత్యాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ చెప్తున్నట్లు సీఐడీకి కోర్టు మెుట్టికాయలు వెయ్యలేదని ప్రశంసించిందని తెలిపారు. సీఐడీ దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ అవసరం లేదని కోర్టే చెప్పిందన్నారు.

మరోవైపు బీజేపీ నేతలు న్యాయ స్థానాలపై గౌరవం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సర్కార్ అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువకు అమ్మేసిందంటూ చేస్తున్న వార్తలు ఎంతమాత్రం వాస్తవం కాదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు హైకోర్టు అమ్ముతుందని స్పష్టం చేశారు. బిడ్స్ వేస్తోంది ఆన్ లైన్లోనని బీజేపీ నేతలు కూడా కావాలంటే వేసుకోవచ్చన్నారు. 

అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం తక్కువ రేటుకు అమ్మేశారంటూ బీజేపీ ఆరోపించడం సరికాదన్నారు. హైకోర్టు దాన్ని అమ్మకానికి పెట్టిందని గుర్తు చేశారు. అబద్దాలు చెప్తేనే తమ ఉనికిని కాపాడుకోవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నట్లున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ అంశం హైకోర్టు పరిధిలో ఉందని దానిపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బీజేపీ ఆరోపణలు చెయ్యడం చూస్తుంటే న్యాయస్థానాలను అవమానించడమేనన్నారు. 

బీజేపీ నేతల వ్యాఖ్యలపై సుమోటో కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల వివరాలు సేకరించి ఆధారాలతో సహా హైకోర్టుకు అందజేస్తానని తెలిపారు.  

8 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని అయితే ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏపీ ప్రభుత్వం మాత్రం బాధితులకు న్యాయం చేస్తుందని గుర్తు చేశారు. తమకు సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఆరోపణలు చేస్తారా అంటూ నిలదీశారు. ఇప్పుడొచ్చి మెుసలికన్నీరు కారుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచింది ఒక్క ఏపీ ప్రభుత్వం మాత్రమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.   

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో కొత్త ప్రభుత్వం, బీజేపీదీ కీలకపాత్ర: రామ్ మాధవ్

కారు చౌకగా అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేసే యత్నం: కన్నా

అగ్రిగోల్డ్ బాధితులను టీడీపీయే అదుకుంటుంది:మంత్రి కాల్వ

ఏపీలో లాలూ ప్రసాద్‌ తరహా ప్రభుత్వం, 6నెలల్లో టీడీపీ క్లోజ్:జీవీఎల్

ఏపీలోకి రాకుండా తరిమికొడతాం: బీజేపీకి ఎంపీ కేశినేని నాని వార్నింగ్

Follow Us:
Download App:
  • android
  • ios