అమరావతి  బాండ్ల విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసే ఆరోపణలు అన్నీ అవాస్తవమని  ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పేర్కొన్నారు. కావాలనే ఉండవల్లి.. అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతి బాండ్లలో అవినీతి జరిగిందని ఆయన నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానని కుటుంబరావు స్పష్టం చేశారు. ఉండవల్లి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు పనులు జరగకముందే బిల్లులు చెల్లించామని అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉండవల్లితో ఏం అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధమని, ఉండవల్లి కోరిన ఏ సమాచారం అయినా ఇస్తానని కుటుంబరావు చెప్పారు.