సాంబారులో పడి మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.

ర్నూల్ : కర్నూల్ జిల్లా నందికొట్యూరు తాలుకా మిడుతూరు మండలం కోడూరు గ్రామంలో అంగన్ వాడీ కేంద్రంలో వేడి సాంబారు గిన్నెలో పడి మూడేళ్ల మధుప్రియ అనే చిన్నారి తీవ్రంగా గాయపడింది.

పాణ్యం మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో సాంబార్‌లో ఓ విద్యార్ధి మృతి చెందాడు. ఈ ఘటన మరువకముందే సోమవారం నాడు నందికొట్కూరు మండలం మిడుతూరు మండలం కోడూరు అంగన్‌వాడీ కేంద్రంలో సాంబారులో పడి మధుప్రియ గాయాలపాలైంది. 

మధుప్రియను చిన్నారి కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.