కర్నూలు: చేతికి అందివచ్చిన కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. బలవన్మరణానికి పాల్పడిన కొడుకును ఎలాగైనా కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు ప్రయత్నించారు. అయితే అప్పటికే మృత్యువు కబలించడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. 

పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసు కేసు నమోదు అయ్యింది. దాంతో మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని పోలీసులు సూచించారు. అయితే తన బిడ్డను ముక్కలుగా కోయోద్దు అంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. 

మృతదేహానికి పోస్టుమార్టం వద్దంటూ చెప్పినా ఆస్పత్రి సిబ్బంది వినిపించుకోకపోవడంతో మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం మృతదేహాన్ని తీసుకుని బైక్ పై పరారయ్యారు. పోలీసులు సైతం అడ్డుకున్నా వారిని తోసేసి మరీ వెళ్లిపోయారు. 

వీడియో

"

ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా దొర్నపాడు మండలం గోవిందిన్నే గ్రామానికి చెందిన రైతుకూలి నారాయణ(18) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

నారాయణ ఆత్మహత్యకు ప్రేమ విఫలమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేమాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

అయితే తమ కుమారుడికి పోస్ట్‌మార్టం అక్కర్లేదంటూ యువకుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగారు. బైక్‌పై మృతదేహాన్ని తీసుకొని పరారయ్యారు. వెంటపడ్డ పోలీసులను సైతం తోసేసి మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు.