Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కాళ్ళు, దేవినేని సంక నాకింది గుర్తులేదా..: కొడాలి నానిపై జవహర్ సంచలనం

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ పై జవహర్ విరుచుకుపడ్డారు. 

KS Jawahar Fires on  ministers kodali nani,  anil kumar yadav
Author
Guntur, First Published Mar 21, 2021, 1:37 PM IST

గుంటూరు: టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి సీఐడి నోటీసులు ఇవ్వడం, విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేకుండా హైకోర్టు స్టే ఇవ్వడంపై మాజీ మంత్రి కెఎస్ జవహర్ స్పందించారు. ఈ విషయమై చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ పై జవహర్ విరుచుకుపడ్డారు. 

''గంజాయి,  గుట్కా గాడికి చంద్రబాబు గారి కాళ్ళు నాకి, దేవినేని ఉమా సంక నాకి రెండు సార్లు సైకిల్ గుర్తుపై పోటీ చేసినప్పుడు,సైకిల్ గుర్తు ఎలా వచ్చిందో తెలియలేదేమో. 2009 రాజశేఖర్ రెడ్డి పావురాల గుట్టలో ల్యాండ్ అయినప్పుడు, మీ గన్నేరుపప్పు తండ్రి శవం కోసం చూడకుండా, మూడు రోజుల పాటు కలకత్తా హోటల్ లో ఏమి చేసాడో, ఈ సారి తాడేపల్లిలో కాళ్ళు నాకటానికి వెళ్ళినప్పుడు అడుగు'' అంటూ మంత్రి కొడాలి నానిపై జవహర్ విరుచుకుపడ్డారు.  
 
''నోటి దూల మంత్రి అనిల్ యాదవ్ కి ఆవేశం ఎక్కువ,విషయం తక్కువ.31 కేసుల్లో ముద్దాయి జగన్ రెడ్డి వెనుక డప్పు కొట్టుకుంటూ తిరిగే అనిల్ కి కనీస అవగాహన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.31 కేసుల్లో స్టే ఇవ్వాలంటూ కోర్టుకి ఎందుకు వెళ్లాడో జగన్ రెడ్డిని చొక్కా పట్టుకొని నిలదీయాలి'' అంటూ మరో మంత్రి అనిల్ యాదవ్ పై ఫైర్ అయ్యారు జవహర్. 

read more  హోదా వద్దు... ఉద్యోగాలొద్దు... వివక్ష పాలనే ముద్దు..: జగన్ పాలనపై అనగాని సెటైర్లు

''ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా వైఎస్ కుటుంబం చంద్రబాబు గారి మీద కేసులు వెయ్యడం వలనే అన్ని కేసులు కోర్టు కొట్టేసింది. జగన్ రెడ్డి కి మ్యాటర్ వీక్, పనికిమాలిన వాడు కాబట్టే చంద్రబాబు గారికి స్టే వచ్చింది. వైకాపా నేతలు ఎక్కువుగా మాట్లాడటం వెనుక త్వరలో సీఎం కావాలి అనుకునే ఒక పెద్దారెడ్డి ప్రణాళిక ఉన్నట్టు వినికిడి'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

''దొంగోడి క‌ళ్ల‌కు ప్ర‌పంచ‌మంతా దొంగోళ్ల‌లా క‌నిపిస్తారు. 43వేల‌కోట్ల ప్ర‌జాధ‌నం దోపిడీదొంగ ఏ1 జ‌గ‌న్‌రెడ్డి చంద్ర‌బాబుపై త‌ప్పుడు కేసులైనా పెట్టి వేధించాల‌ని చూశాడు. అయినా సాధ్యం కాలేదు'' అంటూ సోషల్ మీడియా వేదికన జవహర్ విరుచుకుపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios