గుంటూరు: లోకేష్‌ వేసే ట్వీట్ల‌కి రిప్ల‌యి ఇవ్వ‌లేక‌ కేసుపెట్టే స్థాయికి దిగ‌జారిపోయావా జ‌గ‌న్‌రెడ్డీ? అని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ప్రశ్నించారు. త‌ప్పుడు ట్వీట్లు, మార్ఫ్‌డ్ వీడియోలు, ఫేక్ ఫోటోలు, అవాస్త‌వ వార్తలు, అస‌త్య ప్రచారాల‌‌పైనా కేసులు పెడితే మొద‌ట‌గా పెట్టాల్సింది ఏ1అయిన జగన్,  ఏ2అయిన విజయసాయి రెడ్డిపైన అంటూ మాజీ మంత్రి జవహర్ సోషల్ మీడియా వేదికన విరుచుకుపడ్డారు. 
 
''లోకేష్ అవినీతి చేశాడ‌ని ఆరోపించి రెండేళ్లు కొండ‌ల్ని త‌వ్వి తొండ‌ని కూడా ప‌ట్ట‌లేని జ‌గ‌న్‌రెడ్డి.. చివ‌రికి ట్రాక్ట‌ర్ డ్రైవింగ్‌, కోవిడ్ నిబంధ‌న ఉల్లంఘ‌న, ట్వీట్ చేశాడ‌ని కేసులు పెట్టి నీ పిరికిత‌నాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నావు. ట్వీట్లపై ఎస్సి, ఎస్టీ కేసు పెడుతున్న జగన్ రెడ్డి ధీన పరిస్థితి చూస్తే బాధేస్తుంది. రేనా చూడు రేనా చూడు పాట గుర్తొస్తుంది'' అంటూ ట్విట్టర్ వేదికన ఎద్దేవా చేశారు. 

read more  నిజమే... జగన్ కు సవాల్ విసిరే స్థాయి లోకేష్ ది కాదు: అయ్యన్న సంచలనం

''లోకేష్ సవాల్... జగన్ పరార్...ఇక్కడే తేలిపోయింది వివేకా హత్య వెనుక ఉన్న మిస్టరీ ఏంటో?మీకు,మీ కుటుంబ సభ్యులకు  సంబంధం లేకపోతే వెంకన్న సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి ఎందుకు వెనకాడుతున్నారు జగన్ రెడ్డి గారు.హూ కిల్డ్ బాబాయ్?14 న తేలిపోతుంది. లోకేష్ రెడీ...జగన్ రెడ్డి రెడీనా?'' అన్నారు.

''వివేకానంద‌రెడ్డి హ‌త్య‌లో నిందితుడు శ్రీనివాస‌రెడ్డి మృతి, వివేకా కుట్లేసిన గంగిరెడ్డి మ‌ర‌ణం అన్నీ అనుమానాల‌కు తావిచ్చేలా వున్నాయి. వివేకా హ‌త్య మిస్ట‌రీ వీడ‌క‌పోతే మరిన్ని మ‌ర‌ణాలు త‌ప్ప‌వా?'' అంటూ జవహర్ ఆందోళన వ్యక్తం చేశారు.