Asianet News TeluguAsianet News Telugu

ఏపీ నుంచి నో రెస్పాన్స్: రేపటి కేఆర్ఎంబీ కమిటీ ప్రాజెక్ట్‌ల సందర్శన వాయిదా

రేపటి కేఆర్ఎంబీ కమిటీ రాయలసీమ ప్రాజెక్ట్ పనుల పరిశీలన వాయిదా పడింది. ఎన్జీటీ ఆదేశాలతో రేపు రాయలసీమ ప్రాజెక్ట్ పనులను కేఆర్‌ఎంబీ కమిటీ పరిశీలించాల్సి వుంది. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని కమిటీ తెలిపింది.

krmb committee rayalaseema lift irrigation project visiting postponed ksp
Author
Amaravathi, First Published Jun 29, 2021, 9:07 PM IST

రేపటి కేఆర్ఎంబీ కమిటీ రాయలసీమ ప్రాజెక్ట్ పనుల పరిశీలన వాయిదా పడింది. ఎన్జీటీ ఆదేశాలతో రేపు రాయలసీమ ప్రాజెక్ట్ పనులను కేఆర్‌ఎంబీ కమిటీ పరిశీలించాల్సి వుంది. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని కమిటీ తెలిపింది. దీంతో జూలై 3న పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు వెళ్తామని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చింది కేఆర్ఎంబీ కమిటీ. అదే రోజున సీఐఎస్ఎఫ్ బలగాల భద్రత మధ్య రాయలసీమ ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు వెళ్తామని తెలిపింది. 

కాగా, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించతలపెట్టిన ప్రాంతాన్ని కృష్ణానదీ యాజమాన్య బోర్డు రేపు సందర్శించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై మొన్న సీఎం కేసీఆర్ జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రాజెక్ట్‌లతో తెలంగాణ నష్టపోతుందని వివరించారు. దీనిపై స్పందించిన జలశక్తి మంత్రి కేఆర్ఎంబీని ఆదేశించారు. ఈ పనులను పరిశీలించాలని సూచించారు. అవసరమైతే కేంద్ర బలగాల సాయంతో వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జలశక్తి మంత్రి సూచించారు.

Also Read:తెలంగాణ అభ్యంతరం.. జలశక్తి మంత్రి ఆదేశాలు: రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించనున్న కేఆర్ఎంబీ

దాంతో హరికేశ్ మీనా ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల కమిటీ పనులను పరిశీలించనుంది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరిగింది. శ్రీశైలం జలాలను వాడుకునేందుకు రూ.307 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. సంగమేశ్వరం వద్ద పంపులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి 17.6 కిలోమీటర్ల కాలువ తవ్వి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద శ్రీశైలం కుడికాలువకు కలుపుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios