కారులో కూర్చొని మూడు గంటలకు పైగా నిరసన: పోలీసుల అదుపులో దేవినేని , కొల్లు రవీంద్ర
మాజీ మంత్రులు దేవినేని ఉమ మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలను పోలీసులు ఆదివారం నాడు పామర్రులోనే అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ గుడివాడకు వెళ్తున్న సమయంలో మాజీ మంత్రులను పోలీసులు పామర్రులో అడ్డుకన్నారు. దీంతో కారులోనే కూర్చొని నిరసనకు దిగారు మాజీ మంత్రులు.
విజయవాడ: మాజీ మంత్రులు దేవినేని ఉమ మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలను పోలీసులు ఆదివారం నాడు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రులు గుడివాడకు వెళ్లకుండా పామర్రులోనే పోలీసులు ఈ ఇద్దరు మాజీ మంత్రులను అడ్డుకున్నారు. దీంతో కారులలోనే డోర్ లాక్ చేసుకొని మూడు గంటలకు పైగా కూర్చొని నిరసనకు దిగారు మాజీ మంత్రులు. తమను గుడివాడకు వెళ్లకుడా పోలీసులు అడ్డుపడడాన్ని మాజీ మంత్రులు తప్పుబట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ కారు నుండి దిగకుండా కారు డోర్ లాక్ చేసుకొని కారులోనే కూర్చొని నిరసనకు దిగారు.
కారు డోర్ ను ఓపెన్ చేసి మాజీ మంత్రులు దేవినేని ఉమ మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.టీడీపీ చీఫ్ చంద్రబాబు కుటుంబ సభ్యులపై మాజీ మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. గుడివాడకు వెళ్తున్న టీడీపీ నాయకులను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలను పామర్రు వద్దే పోలీసులు నిలిపివేశారు. పామర్రు వద్దే మాజీ మంత్రులను పోలీసులు నిలిపివేసిన విషయాన్ని తెలుగు దేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పామర్రుకు వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని కూడా అడ్డుకున్నారు.
చంద్రబాబుతో పాటు లోకేష్ పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు.ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేస్తే చంద్రబాబును ఇంటికి వచ్చి కూడ కొడతామని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఈ విమర్శలపై టీడీపీ నేతలు మండిపడ్డారు కొడాలి నాని తీరును నిరసిస్తూ గుడివాడ వైపునకు వెళ్లే టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు ఇద్దరిని పోలీసులు అడ్డుకున్నారు.