విజయవాడ: కృష్ణా జిల్లాలో మరో ఆసుపత్రిపై కలెక్టర్ చర్యలు తీసుకొన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఫీజులు వసూలు చేశారని ఫిర్యాదు మేరకు విచారణ చేసిన జిల్లా కలెక్టర్ ఈ మేరకు ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేశారు.

విజయవాడలోని లిబర్టీ ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని రాజమండ్రికి చెందిన ఓ మహిళ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి కరోనా చికిత్స కోసం లిబర్టీ ఆసుపత్రిలో చేరాడు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయమై బాధిత మహిళ  ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 

also read:ఇండియాలో కరోనా జోరు: మొత్తం కేసులు 47,54,357కి చేరిక

లక్ష రూపాయాలు వసూలు చేసి కూడ తన భర్త ప్రాణాలను కాపడలేదని ఆమె ఆరోపించింది.ఈ విషయమై బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

త్రిసభ్య కమిటి ఈ ఘటనపై విచారణ నిర్వహించింది.  లిబర్టీ ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయం వాస్తవమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది.  ఈ నివేదిక ఆధారంగా  లిబర్టీ ఆసుపత్రిలో కరోనా వైద్యం చేయడంపై నిషేధం విధిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసుపత్రులను  వేరే ఆసుపత్రికి తరలించాలని కూడ కలెక్టర్ ఆదేశించారు.