షాక్: తండ్రి మృతదేహం పక్కనే వారం రోజులుగా కొడుకు

Koteshwar rao found dead in his house
Highlights

డెడ్‌బాడీ పక్కనే వారం రోజులు కొడుకు

విజయవాడ: కృష్ణా జిల్లా కానూరులో విషాదం చోటు
చేసుకొంది. వీటీపీఎస్‌ రిటైర్డ్ ఉద్యోగి కోటేశ్వర్ రావు
మరణించాడు. అయితే అతడి మృతదేహం వద్దే
మతిస్థిమితం లేని కొడుకు ఉన్నాడు. స్ధానికులు పోలీసులకు
ఫిర్యాదు చేయడంతో కోటేశ్వర్ రావు మరణించిన విషయం
వెలుగు చూసింది.

కృష్ణా జిల్లా కానూరులోని తన ఇంట్లో కోటేశ్వర్ రావు మృతి
చెందాడు. వారం రోజుల క్రితమే కోటేశ్వర్ రావు
మరణించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కోటేశ్వర్
రావు తన మతిస్థిమితం లేని కొడుకుతో కలిసి ఆ ఇంట్లో
నివాసం ఉంటున్నాడు.

కోటేశ్వర్ రావు ఇంటి నుండి దుర్వాసన వస్తున్న విషయాన్ని
స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు తలుపులు పగులగొట్టి చూస్తే కోటేశ్వర్ రావు
మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఆ మృతదేహం
పక్కనే కొడుకు రామలింగేశ్వరరావు కూర్చొని ఉన్నాడు.

కోటేశ్వర్ రావు అనారోగ్య కారణాలతో మరణించాడా,
మతిస్థిమితం లేని కొడుకు కోటేశ్వర్ రావుపై దాడి చేస్తే
మరణించాడా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు
చేస్తున్నారు. 

కోటేశ్వర్ రావు మృతదేహన్ని స్థానిక ఆసుపత్రిలో పోస్ట్
మార్లం నిర్వహించారు. 


 

loader