మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనిల్ వర్గానికి చెందిన సమీర్ అనే వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. 

నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బారాషాహీ దర్గా వద్ద రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. అనిల్ వర్గానికి చెందిన సమీర్‌ను కత్తితో పోడిచారు కోటంరెడ్డి వర్గీయులు. దీంతో వెంటనే సమీర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.