నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు   కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో  చేరిక  సమయంలో  అపశృతి  చోటు  చేసుకుంది.  బాణసంచా కారణంగా నిప్పురవ్వలు పడి ముగ్గురు గాయపడ్డారు.  

గుంటూరు:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరిక సమయంలో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారంనాడు గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయం వద్ద గిరిధర్ రెడ్డి అనుచరులు టపాసులు కాల్చారు. ప్రమాదశాత్తు టపాసుల నుండి నిప్పురవ్వలు పడి ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇవాళ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిశ్రీధర్ రెడ్డి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కార్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఈ విషయమై తన వద్ద ఆధారాలున్నాయని శ్రీధర్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.