ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్స్‌కు వైసీపీ ఎసినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి టీడీపీ జాతీయ మ్మెల్యే కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్స్‌కు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అవసరం వచ్చినప్పుడు పిలుస్తాం.. అవసరం లేనప్పుడు అవమానిస్తామనే రకం చంద్రబాబు అని విమర్శించారు. ఈరోజు కొడాలి నాని ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. 4,000 వేల కి.మీ అంటూ లోకేష్ పాదయాత్ర చేపట్టాడని.. కానీ ప్రజల నుంచి ఏ మాత్రం స్పందన లేదన్నారు. చంద్రబాబు మరోవైపు యుద్దం యుద్దం అంటూ సీఎం జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీతో కలిసి పనిచేసేలా చంద్రబాబు ఒప్పించాడని.. ఢిల్లీలో ఓ బ్యాచ్‌ను పెట్టి బీజేపీని కలుపుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ కలవకపోతే.. కాంగ్రెస్‌ను, వామపక్షాలను అయినా కలుపుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తాడని అన్నారు. జగన్ మీద వ్యతిరేకత ఉందని చెబుతూ కూడా.. మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తారా? అనే ప్రశ్నను ముందుగానే రాయించుకుని.. ఆహ్వానిస్తానని, మార్పు రావాలని ఉందని లోకేష్ చెప్పాడని అన్నారు. . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. జగన్ అధికారంలో నుంచి దించడానికి ఉన్న సపోర్ట్ సరిపోదని కొత్త సపోర్టు కోసం చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారని విమర్శించారు. టీడీపీని కాపాడటం వారి వల్ల కాదని చంద్రబాబు, లోకేష్‌లకు అర్థమైందని అన్నారు.
ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేష్ ఆహ్వానించడమేమిటని ప్రశ్నించారు. టీడీపీని చంద్రబాబు నాయుడు పెట్టాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ అవసరం కోసం జూనియర్ ఎన్టీఆర్ రావాలంటే.. ఆయన వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను గతంలో టీడీపీలో ఆహ్వానించారని.. అప్పుడు ఆయన పార్టీ కోసం ప్రచారం చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా చూశారని అన్నారు.
టీడీపీకి ప్రతిపక్ష హోదా రావాలంటే.. ఆ పార్టీలో మార్పు రావాలని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే 2024లో కనీసం ప్రతిపక్ష హోదా దక్కుతుందని అన్నారు. జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళితే.. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. టీడీపీకి డిపాజిట్ కూడా రాదని విమర్శించారు. చంద్రబాబు సారథ్యంలో టీడీపీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. మరో పదికాలాల పాటు ఎన్టీఆర్ పేరు వినిపించాలంటే.. జూనియర్ ఎన్టీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తేనే అది సాధ్యమని చెప్పారు.
ఇదిలా ఉంటే.. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా.. శుక్రవారం తిరుపతిలో ‘హలో లోకేష్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, పవన్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా? అని ఒకరు ప్రశ్నించగా… ‘ఆహ్వానిస్తాను. రాష్ట్రంలో మార్పు రావాలి.. అగ్రస్థానానికి వెళ్లాలని ఆశించిన వారు 100% రాజకీయాల్లోకి రావాలి. 2014లో ఒకసారి పవన్ ను కలిశాను. అప్పుడు ఆయన మంచి మనసు నాకు తెలిసింది’ అని లోకేష్ చెప్పుకొచ్చారు.
