దారుణం:మాంసం వండలేదని తల్లిని హత్య చేసిన కొడుకు

First Published 3, Jun 2018, 3:19 PM IST
Kishore kills his mother for non vegetarian curry
Highlights

నాన్‌వెజ్ కోసం తల్లిని చంపిన తనయుడు 

గుంటూరు: మద్యం మత్తులో  మాంసం వండలేదని ఓ  
కొడుకు తల్లిని  కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన
గుంటూరు జిల్లాలో చోటు చేసుకొంది.

గుంటూరు జిల్లా తాడికొండ  మండలం బడేపురం గ్రామంలో  
ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న కిషోర్ అనే వ్యక్తి
ఆదివారం నాడు ఉదయం పూట తన తల్లిని  కత్తితో పొడిచి
అత్యంత దారుణంగా హత్య చేశాడు.

మద్యం మత్తులో ఉన్న కిషోర్ మాంసం వండలేదనే
కారణాన్ని సాకుగా చూపి తల్లిని హత్య చేశాడు. మద్యానికి
బానిసగా మారిన కిషోర్ వేధింపులు భరించలేక  భార్య కూడ
అతడిని వదిలేసి పుట్టింటికి వెళ్ళింది.

అయితే ఆస్తి పంపకాల విషయంలో తన కంటే తన
సోదరుడికే తల్లి ఎక్కువ ఆస్తిని  ఇచ్చేలా చేసిందని కిషోర్
ఆమెపై కక్షను పెంచుకొన్నాడని స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయమై ఇటీవల కాలంలో తల్లితో తరచూ గొడవకు
దిగేవాడని వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు
చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

loader