Asianet News TeluguAsianet News Telugu

పశ్చిమగోదావరి జిల్లాలో వైరల్ ఫీవర్స్.. బాధితుల్లో చిన్నారులే అధికం, ముగ్గురి మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలోని (west godavari district) పలు గ్రామాల్లో విష జ్వరాలు (viral fevers) విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు అంతుచిక్కని జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం (koyyalagudem) మండలం బోడిగూడెంలో (bodigudem) అంతుచిక్కని జ్వరాలు అల్లాడిస్తున్నాయి. 

killer fevers students admitted to hospitals in west godavari district
Author
Eluru, First Published Dec 5, 2021, 2:32 PM IST

ఓ పక్క కరోనా వేరియంట్ (coronavirus) ఒమిక్రాన్ (omicron) భయాలు వెంటాడుతున్న వేళ.. సీజనల్ వ్యాధులు ప్రభుత్వాలను వణికిస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో కిల్లర్ ఫీవర్స్ దడ పుట్టిస్తున్నాయి. వచ్చింది జ్వరమో, కరోనాయో తెలియక సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని (west godavari district) పలు గ్రామాల్లో విష జ్వరాలు (viral fevers) విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు అంతుచిక్కని జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం (koyyalagudem) మండలం బోడిగూడెంలో (bodigudem) అంతుచిక్కని జ్వరాలు అల్లాడిస్తున్నాయి. ఎలా వస్తుందో… ఎందుకొస్తుందో తెలియని విష జ్వరాలతో గ్రామం మొత్తం మంచాన పడింది. ఎక్కువగా విద్యార్ధులే బాధితులుగా మారుతున్నారు. దాదాపు 50 మందికి పైగా పిల్లలు ఫీవర్స్‌ బారినపడ్డారు. ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

ALso Read:మాస్స్ ఉంటేనే బస్సులోకి .. TSRTC ఎండీ సజ్జనార్ కీలక ఉత్తర్వులు

ఎక్కువ మంది జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా కేసులు దేశంలో క్రమేపీ పెరుగుతుండడంతో కొంతమంది ఇళ్లల్లోనే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. గ్రామాల్లో అనేక చోట్ల పీహెచ్‌సీలకు ప్రతి రోజు వైరల్‌ జ్వరాల చికిత్సకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోంది. వాతావరణంలో చోటు చేసుకున్న పలు మార్పులు కారణంగా విష జ్వరాలు ప్రబలుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు, మంచినీళ్లు కలుషితం కావడం, శానిటేషన్ సరిగా లేకపోవడంతోనే పిల్లలు విషజ్వరాల బారిన పడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios