Asianet News TeluguAsianet News Telugu

నేటినుండే రైతులకు ఖరీఫ్ విత్తనాల పంపిణీ...ఆ జిల్లాల రైతులకు రెట్టింపు సబ్సిడీ

ఖరీప్ సాగుకోసం సిద్దమవుతున్న రైతులను సబ్సడీపై విత్తనాలు అందించే కార్యక్రమాన్ని ఇవాళ్టి నుండి ప్రారభించింది ఏపి ప్రభుత్వం. 

kharif seed distribution programme begins in Andhra pradesh
Author
Amaravathi, First Published May 18, 2020, 12:23 PM IST

అమరావతి: ఖరీప్ సాగుకు సిద్దమవుతున్న రైతుల  కోసం ఇప్పటికే విత్తనాలను సేకరించిన ప్రభుత్వం వాటి పంపిణీకి శ్రీకారం చుట్టింది. నేటి (సోమవారం) నుండే   గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. రైతులకోసం ఇప్పటికే 8 లక్షల క్వింటాళ్లు పైగా విత్తనాలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

ఇ-క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 5,07,599 క్వింటాళ్ళ వేరుశనగ, 2,28,732 క్వింటాళ్ల వరి,  88,215 క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలు సిద్దం చేశామన్నారు. పచ్చిరొట్ట పంటల విత్తనాలపై 50 శాతం, వేరుశనగ విత్తనాలపై 40 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. 

13 రకాల వరి వంగడాలపై క్వింటాల్ కు రూ.500 సబ్సిడీ రైతులను లభించనుంది. గ్రామ సచివాలయాల వద్ద విత్తనాల ధరల పట్టికను ప్రదర్శించాలని అధికారులకు సూచించారు.  జాతీయ ఆహార భద్రతా మిషన్ లో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రైతులకు వరి వంగడాలపై రెట్టింపు సబ్సిడీ లభించనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios