Asianet News TeluguAsianet News Telugu

ఏపీ బడ్జెట్.. వివిధ రంగాల కేటాయింపులు

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 

key points of Andhra Pradesh Budget 2020-21
Author
Hyderabad, First Published Jun 16, 2020, 2:23 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెడుతోంది.రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. 

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో‌ బడ్జెట్‌  ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రారంభించారు.

వివిధ రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపులు

వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు
పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు
హోంశాఖకు రూ.5,988.72 కోట్లు
జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు
ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు
కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు
పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 16710.34 కోట్లు
న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు
మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 856.64 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు
ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు
విద్యుత్‌ రంగానికి రూ. 6,984.72 కోట్లు
ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు
సోషల్‌ వెల్ఫేర్‌ కోసం రూ.12,465.85 కోట్లు
ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు
మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios