Asianet News TeluguAsianet News Telugu

హతుని గుట్టు విప్పిన తాళం చెవి !!

తూర్పు గోదావరి జిల్లా, నడకుదురు శివార్లలోని యానం బైపాస్ రోడ్డులో హత్యకు గురైన గుర్తుతెలియని యువకుడి వివరాలు వెల్లడైనట్లు తెలిసింది. నడకుదురు కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామాల మధ్య తుమ్మ చెట్ల గుంపులో గుర్తుతెలియని దుండగులు ఇటీవల ఓ వ్యక్తిని  పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయం తెలిసిందే. 

key opens identification of the deceased young man in East Godavari - bsb
Author
Hyderabad, First Published Mar 20, 2021, 1:08 PM IST

తూర్పు గోదావరి జిల్లా, నడకుదురు శివార్లలోని యానం బైపాస్ రోడ్డులో హత్యకు గురైన గుర్తుతెలియని యువకుడి వివరాలు వెల్లడైనట్లు తెలిసింది. నడకుదురు కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామాల మధ్య తుమ్మ చెట్ల గుంపులో గుర్తుతెలియని దుండగులు ఇటీవల ఓ వ్యక్తిని  పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయం తెలిసిందే. 

సంఘటన స్థలాన్ని, పరిసరాలను పోలీసులు మూడు రోజులుగా జల్లెడ పట్టినా కొంచెం కూడా క్లూ దొరకలేదు. దీంతో ఈ హత్య కేసు పోలీసులకు సవాలుగా నిలిచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హతుడిని రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన వేపకాయల సతీష్ కుమార్ గా గుర్తించారని తెలిసింది.

గుర్తుతెలియని హత్య శీర్షికన ఈనెల 17న వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను చూసిన హతుని భార్య,  పిల్లలతో కలిసి ఘటనా స్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించింది. అతని మొలకి ఉన్న తాళంచెవి ఆధారంగా హతుడు సతీష్ కుమార్ అని గుర్తించింది.

అతడు కాకినాడ వెళ్లి వస్తానని ఈనెల 15న ఇంటి దగ్గర చెప్పి వెల్ల నుంచి సైకిల్ మీద బయలుదేరాడు. అదే గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సైకిల్ ఉంచి వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి రాలేదు. హతుని వద్ద లభ్యమైన తాళంచెవితో అతడి సైకిల్ తాళం తెరుచుకుంది. హతుడి చేతిపై పాత గాయాలు, దుస్తుల ఆధారంగా కూడా అతడు సతీష్ కుమార్ అని గుర్తించారు.

అతడు కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండటంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. అతడికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని కూడా అంటున్నారు. గతంలో అతడు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు అని చెబుతున్నారు. సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేక వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఎవరైనా హత్య చేశారా అనేది తెలియలేదు. అయితే ఈ విషయాలను పోలీసులు ధ్రువీకరించలేదు.

ఇంతవరకూ హతుని వివరాలు చెప్పారు, కానీ హంతకుల వివరాలు తెలియలేదని కడప ఎస్ ఐ డి రామారావు చెప్పారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios