ఈ ఉదయం 11 గంటల 45 నిమిషాలకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

  • రూ. 29 కోట్లతో తిరుమలలో కాటేజీల ఆధునీకరణ 
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రచార రథాల ద్వారా హిందూ ధర్మం ప్రచారం
  • ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కళ్యాణమస్తు కార్యక్రమం 

అంతకుముందు టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామి వారికి భక్తులు సమర్పించిన ఆస్తులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా 1,128 ఆస్తులు, 8,088 ఎకరాల విస్తీర్ణంలో ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వున్న ఆస్తులను ఏ విధంగటా వినియోగంలోకి తీసుకురావాలని పరిశీలన కోసం కమిటీని నియమించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

వైకుంఠ ఏకాదశ సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి వుంచాలని నిర్ణయించినట్లు వైవీ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల పరిశీలన కోసం కమిటీని నియమించామని ఆయన పేర్కొన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతుల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.