సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు మీడియాకు తెలిపారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ (ap cabinet meeting) సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే జూన్ 1 నుంచి గోదావరి డెల్టాకు నీరు విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే అదే రోజు నుంచి రాష్ట్రంలోని కాలువలకు నీళ్లు విడుదల చేయాలని నిర్ణయించారు. 

కేబినెట్ నిర్ణయాలు:

  • జూన్ 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు ఛానెల్ నుంచి నీటి విడుదల
  • జూలై 15 నుంచి నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల
  • రాయలసీమకు జూన్ 30 నుంచి నీటి విడుదల
  • ఉత్తరాంధ్రకు నీటి విడుదలకు సంబంధించి త్వరలోనే తేదీల ప్రకటన
  • పులిచింతలలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకునేందుకు వెసులుబాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది
  • రేపు మత్స్యకార భరోసా, ఈ నెల 16 నుంచి రైతు భరోసా డబ్బులు చెల్లింపుకు ఆమోదం
  • ఈ నెల 19న పశు అంబులెన్స్‌లు ప్రారంభం
  • జూన్ 21న అమ్మ ఒడి నిధుల విడుదల