Asianet News TeluguAsianet News Telugu

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

Kethireddy Venkatarami Reddy: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించే పేరు. ప్రధానంగా ’గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారారు. ఇంతకీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎవరు? ఆయన బాల్యం, వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రస్థానం ఎలా ఉందో తెలుసుకుందాం. 

Kethireddy Venkatarami Reddy Biography, Age, Caste, Children, Family, Political Career KRJ
Author
First Published Mar 20, 2024, 11:36 PM IST

Kethireddy Venkatarami Reddy: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించే పేరు. ప్రధానంగా ’గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారారు. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులంటే.. నియోజకవర్గాల్లో ఏదైనా అభివృద్ధి పనులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు వస్తుంటారు. కానీ, తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మాత్రం పట్టించుకోరు.

మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు మళ్లీ నియోజకవర్గం గురించి అసలు ఆలోచించరు. కానీ, అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రూటే సపరేట్. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వాటి సమస్యలు తెలుసుకుంటారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని స్వయంగా ఆయనే వచ్చి ఆరా తీస్తారు. సమస్య ఏదైనా.. సరైన పరిష్కారం లభించేదాకా అక్కడే ఉంటారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట ఆయన నియోజకవర్గంలో ఏదోక గ్రామంలో తరుచు పర్యటిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన లైఫ్ స్టోరీని తెలుసుకుందాం

బాల్యం, విద్యాభ్యాసం

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 1980లో కేతిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి దంపతులకు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో జన్మించాడు. వారిది రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబం. కేతిరెడ్డి జన్మించే నాటికి అంటే 1980 ప్రాంతంలో రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తాండవిస్తోంది. దీంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తండ్రి ఆయనను మూడేండ్ల వయసులో తాడిపత్రిలో ఉన్న అరవింద్ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడే వెంకటరామిరెడ్డి పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది. ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉన్న భారతీయ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తరువాత రిలయన్స్ లో మంచి ఉద్యోగం రావడంతో హైదరాబాద్ కు మారారు. ఈ తరుణంలో సుప్రియ రెడ్డితో వివాహం జరిగింది. కొన్ని రోజులు హైదరాబాదులోనే జీవనం కొనసాగించారు. 

కుటుంబ నేపథ్యం

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తండ్రి సూర్య ప్రతాపరెడ్డి కాంగ్రెస్ తరపున 1999 ఎన్నికల్లో ధర్మవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. కానీ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో టీడీపీ తరఫున కంటెస్టెంట్ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపాలయ్యారు.ఈ లోగా కేతిరెడ్డి నాన్న సూర్య ప్రతాపరెడ్డి ఆరోగ్యం చెడిపోయింది. షుగర్ వ్యాధితో పాటు రెండు కిడ్నీలు చెడిపోయాయి.  ట్రీట్మెంట్ కోసం 2006లో హైదరాబాద్ వచ్చాడు. కిడ్నీ ఆపరేషన్ అయ్యాక ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థులు ఆయనను తాడిపత్రి రైల్వేస్టేషన్ లో వేట కొడవలతో నరికి చంపేశారు. ఈ దుర్ఘటన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జీవితాన్నే మార్చివేసింది. తన కుటుంబానికి అండగా నిలవడానికి వెంకట్రామిరెడ్డి ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.

రాజకీయ జీవితం 

ఇలా 2009లో దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నాయకత్వం లో కాంగ్రెస్లో చేరారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ధర్మవరం టికెట్ కేతిరెడ్డికి దక్కింది. కేతిరెడ్డి మొత్తం ధర్మవరం మీద పట్టు సాధించాడు 2009లో తన సమీప అభ్యర్థి జీ సూర్యనారాయణ మీద 19,172 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు వైయస్సార్ పార్టీలో చేరారు. కానీ, ఆ ఎన్నికల్లో కేతిరెడ్డిని ప్రజలు ఓడించారు. టిడిపి అభ్యర్థి సూర్యనారాయణ చేతిలో 14వేల తేడాతో ఓడిపోయారు. అయినా  ఆయన ఏ మాత్రం నిరాశ చెందకుండా ఓడిపోవడానికి కారణాలేంటి? తనలో ఉన్న లోపాలు ఏంటో తెలుసుకున్నారు. ఆ తరువాత నిత్యం నియోజకవర్గంలో ఉంటూ ప్రజల సమస్య పరిష్కారానికి క్రుషి చేశారు. 2019లో మరోసారి ధర్మవరం నుంచి గెలుపొందారు. 

గుడ్ మార్నింగ్ ధర్మవరం 

ఎమ్మెల్యేగా గెలిచాక మునుపుటి మాదిరి చేసిన తప్పులు చేయకుండా కొత్తగా వినూత్నంగా చేయాలని అసెంబ్లీ సమావేశాలు ఉంటే అసెంబ్లీలో లేదంటే ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇలా 2020 డిసెంబర్లో  ‘గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం’  అనే ప్రోగ్రాం మొదలుపెట్టి ప్రజల వద్దకే వెళుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలకు తెలుసుకొని సత్వరమే పరిష్కరిస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం ఎంపిక చేసిన గ్రామాల్లో, వార్డుల్లో సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్, గ్రామ సచివాలయం సిబ్బందితో కలిసి ఆయన పర్యటిస్తున్నాడు.

ఆయనే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని రేషన్ కార్డు దగ్గర నుంచి రోడ్డు పనులు, చెత్త తరలింపు వంటి సమస్యలను అక్కడకక్కడే పరిష్కరిస్తున్నారు.  పొరపాటు చేసిన అధికారులపై కోపగించుకొని తప్పు చేసిన అధికారిపై కొరడా దులిపిస్తున్నారు. మళ్లీ అలాంటి పొరపాట్లు చేయవద్దని వార్నింగ్ ఇస్తున్నారు. పేరుకి తగ్గట్టు ధర్మవరంలో ఇకనుంచి ఫ్యాక్షన్ ఉండకూడదని అంతా ధర్మబద్ధంగానే ఉండాలని, రాగద్వేషాలను విడనాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.  

వివాదాలు

ఇక వివాదాల విషయానికి వస్తే.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వెంకటరామిరెడ్డి పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ధర్మవరం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వం భూములను వెంకటరామిరెడ్డి తన అనుచరులకు అప్పనంగా అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios