చంద్రబాబు కోసం.. రిషికేష్ లో కేశినేని దంపతుల ప్రత్యేక పూజలు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ విజయవాడ ఏంపీ కేశిసినేని శ్రీనివాస్ రిషికేష్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు మీడియా దృష్టి.. ప్రజల దృష్టి అంతా కేంద్రీకృతమైన ఒకే ఒక అంశం చంద్రబాబు నాయుడు అరెస్ట్.. శనివారం తెల్లవారు జామునా ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబును అరెస్ట్ చేసి.. మరుసటి రోజు రాత్రి ఆయనకు రిమాండ్ విధించి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం అంతా చకచకా జరిగిపోయాయి.
ఇన్నేళ్ళ రాజకీయ జీవితం లో మచ్చలేకుండా బ్రతికిన చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష్య సాధింపులో భాగంగానే జైలుకు పంపించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ తరుణంలో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తెదేపా రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ బంద్ కు పిలుపునిచ్చింది. ఇలా పలువురు నేతలు సంఘీభావం ప్రకటించడం.చంద్రబాబుకు అండగా ఉండటం చేస్తున్నారు.
ఈ తరుణంలో తాజాగా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ విజయవాడ ఎంపీ కేశిసినేని శ్రీనివాస్ రిషికేష్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన యోగక్షేమాల కోసం పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేష్ లో మంగళవారం ఎంపీ కేసినేని దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు.పూజా హోమాది కార్యక్రమాల అనంతరం పవిత్ర గంగానది హారతిలో పాల్గొని శ్రీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ధైర్యం కలగాలని కేశినేని నాని దంపతులు ప్రార్థించారు.