కేశినేని నాని సోషల్ మీడియాలో రోజు రోజుకీ మరింత చురుగ్గా తయారౌతున్నారు. తాను ఏం చెప్పాలని అనుకున్నా... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఊరుకుంటున్నాడు. ఇప్పటికే ప్రజా వేదికపై సెటైర్లు వేసిన  కేశినేని... తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై కామెంట్ చేశారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... శుక్రవారం ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. గోదావరి, కృష్ణా జలాల గురించి చర్చించుకున్నారు. దీనిపై  కేశినేని స్పందించారు.

‘‘ సమస్యల పరిష్కారానికి కేసీఆర్, జగన్ చొరవను అభినందిస్తున్నానని కేశినేని చెప్పుకొచ్చారు. ప్రశ్న ఏమిటంటే.. జగన్ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? లేదంటే ఏపీకి సంబంధించిన పెండింగ్ లో ఉన్నవాటిని సాధిస్తున్నారా? అసలేం జరుగుతోందన్నట్లుగా కేశినేని ఫేస్ బుక్ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు.