ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని. ఉదయం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను చూసిన ఆయన సినిమా అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. తెలుగు జాతికే కథానాయకుడు సినిమా గర్వకారణమని అభిప్రాయపడ్డారు.
విజయవాడ: ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని. ఉదయం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను చూసిన ఆయన సినిమా అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. తెలుగు జాతికే కథానాయకుడు సినిమా గర్వకారణమని అభిప్రాయపడ్డారు.
తెలుగు ప్రజలకు చరిత్రలో ఓ రామాయణంలాగా ఈ సినిమా మిగిలిపోతుందన్నారు. పేదవారికి కూడు, గుడ్డ, నీరు అందిచాలన్న లక్ష్యంతోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తీరు అద్భుతం అన్నారు.
దివిసీమ తుఫాను, రాయలసీమ కరువును చూసి ఎన్టీఆర్ చలించిపోయారని నాని గుర్తు చేశారు. ప్రజాసేవ కోసమే రాజకీయాలకు అంకితమైన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్‌లో మేయర్ కోనేరు శ్రీధర్‌తో కలిసి నాని ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను చూశారు.
తెలంగాణ రాష్ట్రంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత దివంగత ఎన్టీఆర్ అన్నారు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ తన తనయుడుకి ఆయన పేరు పెట్టుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. నందమూరి వారి రామాయణం అనే కావ్యం ఎలాగో ఎన్టీఆర్ కథానాయకుడు అలాంటిదేనన్నారు.
