కెఇ ప్రభాకర్ ఏకగ్రీవం

కెఇ ప్రభాకర్ ఏకగ్రీవం

టిడిపి ఖాతాలో మరో ఎంఎల్సీ స్ధానం చేరింది. కర్నూలు స్థానిక సంస్థల ఉప ఎన్నికలో పోటీ లేకుండానే కెఇ ప్రభాకర్ గెలిచారు. స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేఫషన్లను ఉపసంహరించుకోవటంతో టిడిపి తరుపున బరిలోకి దిగిన కెఈ ప్రభాకర్ ఏకగ్రీవమయ్యారు. ఈ ఎన్నికలో పోటీ నుండి వైసిపి తప్పుకోవటం అందరికీ తెలిసిందే. శిల్పా చక్రపాణి రెడ్డి తెలుగుదేశం పార్టీతో పాటు తన ఎమ్మెల్సీగా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక వచ్చింది. అయితే, టిడిపి మాజీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్దతుదారుడు నాగిరెడ్డి నామినేషన్ ఉపసంహరణపై ఎటూ తేల్చకపోవటంతో గురువారం సాయంత్రం వరకూ ఉత్కంఠ సాగింది. అయితే, బైరెడ్డి గురువారం రాత్రి చంద్రబాబునాయుడును కలిసారు. శుక్రవారం ఉదయం నాగిరెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకోవటంతో ప్రభాకర్ గెలుపు ఏకగ్రీవమని తేలిపోయింది.  

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos