కర్నూలు: తెలంగాణ ఇస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అక్కడ సర్వనాశనం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కర్నూలులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి మంగళవారం  ప్రసంగించారు. 

నరేంద్ర మోడీకి అధికారం ఇస్తే దేశాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రం ఎపికి సహకరించడం లేదని ఆయన అన్నారు. మోడీ, జగన్, కేసీఆర్ కలిసి నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు. వారంతా కలిసి రాష్ట్రంపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు.

అన్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ తెస్తామని, దాని కాలుష్యం తగ్గుతుందని ఆయన చెప్పారు. రూ.149 రూపాయలకే ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇంటింటికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామని హామీ ఇచ్చారు. 

అమరావతి ప్రపంచంలోనే అగ్ర నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.